తెలంగాణలో 'సరళ్' వ్యూహాన్ని అమలుచేయబోతున్న BJP

వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే పట్టుదలతో భారతీయ జనతాపార్టీ అధినాయకత్వం ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న కేసీఆర్ కు అడ్డుకట్ట వేయాలంటే తెలంగాణలో ముందు ఓడించాలనే యోచనలో బీజేపీ ఉంది. అందుకనుగుణంగా బీజేపీ నేతలు తమ ప్రణాళికను అమలు చేసుకుంటూ వెళుతున్నారు.

తెలంగాణలో పెరుగుతున్న రాజకీయ వేడి

తెలంగాణలో పెరుగుతున్న రాజకీయ వేడి


ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణలో రాజకీయ వేడి పెరుగుతోంది. గతంలో అధికారంలో లేని రాష్ట్రాల్లో ఏ తరహా వ్యూహాన్ని అమలు చేశారో అదే వ్యూహాలను అమలుపరిచి అధికారంలోకి రావాలనే దృఢ నిశ్చయంతో ఉన్నారు. తాజాగా ఆ పార్టీ 'స‌ర‌ళ్‌' యాప్‌ను ప్ర‌వేశ పెట్ట‌బోతోంది. ఇంగ్లిషులో SARAL గా ఉండే ఈ పేరుతో ఒక్కో అక్షరానికి ఒక్కో పేరు ఉంటుంది. S అంటే సంఘటన్‌, R అంటే రిపోర్టింగ్‌, A అంటే అనాలసిస్‌, L అంటే లీడ్‌గా బీజేపీ నేత‌లు పేర్కొంటున్నారు. 'సంఘటన్‌ మహా విస్తార్‌' అభియాన్‌లో భాగంగా పార్టీ అవలంబించే విధానాలు, కార్యక్రమాలను అట్టడుగు స్థాయి కార్యకర్తకు కూడా చేరాలనే లక్ష్యంతో ఈ యాప్‌ను రూపొందించారు.

దేశవ్యాప్తంగా పార్టీకి చెందిన పూర్తి సమాచారం

దేశవ్యాప్తంగా పార్టీకి చెందిన పూర్తి సమాచారం

తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 6,973 శక్తి కేంద్రాలు, 34,867 బూత్‌లు ఉన్నాయి. కొంతమంది ఎంపిక చేయబడ్డ కార్యకర్తలకు క్యూ ఆర్ కోడ్ ను పంపించారు. వారు ఈ యాప్ ను డౌన్ లోడు చేసుకోవచ్చు. పార్టీ శ్రేణులు, అభిమానులు గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అంతేకాకుండా 63591 19119 నెంబరుకు మిస్డ్‌ కాల్‌ ఇవ్వొచ్చు. ఈ యాప్‌లో బీజేపీకి దేశవ్యాప్తంగా ఉన్న శక్తి కేంద్రాలు, బూత్‌లు, జిల్లాలు, మండలాలు, విభాగాలు, రాష్ట్రాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందుపరిచారు.

తెలంగాణలో అధికారంలోకి వస్తాం?

తెలంగాణలో అధికారంలోకి వస్తాం?

ఈ సరళ్ యాప్ కూడా సామాజిక మాధ్యమాలకు అనుసంధానమై ఉంటుంది. అధిష్ఠానం నిర్వహించబోయే కార్యక్రమాలు, దేశంలో పార్టీ ప్రముఖుల రోజువారీ కార్యక్రమాల వివరాలు ఎప్పటికప్పుడు సరళ్ ద్వారా తెలుసుకోవచ్చు. పశ్చిమ బెంగాల్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ యాప్ ను వినియోగించుకొని మంచి ఫలితాలు రాబట్టామని, అలాగే తెలంగాణలో కచ్చితంగా అధికారంలోకి వస్తామని పార్టీ నేతలు నమ్మకంతో చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+