హైదరాబాద్‌లో హై అలర్ట్.. నాలుగు చోట్ల బాంబు కలకలం !
హైదరాబాద్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికంగా ఉన్న సిటీ సివిల్ కోర్టులో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి మెయిల్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ అనూహ్య మెయిల్ తో కోర్టు సిబ్బంది వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో కలిసి తక్షణమే కోర్టు ప్రాంగణానికి చేరుకొని విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
అయితే సిటీ సివిల్ కోర్టుతో పాటు రాజ్‌భవన్, జింఖానా క్లబ్, సహా మరో రెండు చోట్ల బాంబు పెట్టినట్టు మెయిల్ చేశాడు. ఆ ప్రదేశాల్లో కూడా పోలీసులు తనిఖీలు చేపట్టారు. బాంబు ఉంచినట్టు సమాచారం ఇచ్చిన వ్యక్తి ఎవరు? మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఈ నేపథ్యంలో కోర్టు చీఫ్ మెజిస్ట్రేట్ ఆదేశాలతో కోర్టు కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసి.. కోర్టులో ఉన్న అధికారులు, లాయర్లు, సాధారణ ప్రజలను వెంటనే బయటకు పంపించారు. అనంతరం కోర్టు భవనంలోని ప్రతి మూలను బాంబ్ డిటెక్షన్ టీం పూర్తిగా తనిఖీ చేస్తోంది. ఈ బాంబు బెదిరింపుల విషయంలో ఎంతవరకు నిజం ఉందన్నది ఇప్పటికీ స్పష్టతకు రాలేదు.
కాగా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. బాంబు వ్యవహారం పూర్తిగా నిర్ధారణ అయిన తర్వాత వెల్లడిస్తామని తెలిపారు. భద్రతా చర్యల భాగంగా కోర్టు ఆవరణలో పటిష్ట తనిఖీలు జరుపుతున్నామని స్పష్టం చేశారు.
ఈ ఘటనతో కోర్టు సహా ఆయా ప్రాంతాల పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. అక్కడకు భారీగా పోలీసులు మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఊహించని ఘటనతో గతంలో భాగ్యనగరంలో చోటు చేసుకున్న బాంబ్ బ్లాస్ట్ ఘటనలను గుర్తు చేసుకొని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
-
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి!










Click it and Unblock the Notifications