బ్రేకింగ్: ప్రియాంకా రెడ్డి హత్యకేసు చేదించిన పోలీసులు.. నలుగురు మానవ మృగాల అరెస్ట్

Recommended Video

    Vet Doctor Murder Case Solved, Four People Arrested

    తెలంగాణ రాష్ట్రంలో ప్రియాంక రెడ్డి హత్య కలకలం రేపుతుంది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ వద్ద జరిగిన దారుణం లో పోలీసులు ఇప్పటికే కీలక ఆధారాలను సేకరించారు. ప్రియాంక రెడ్డి ని అత్యాచారం చేసి, అతి దారుణంగా హత్య చేసి ఆపై 28 కిలోమీటర్ల మేర మృతదేహాన్ని తీసుకు వెళ్లి అక్కడ పెట్రోల్ పోసి తగలబెట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక ఈ కేసులో నిందితులను పట్టుకున్నారు పోలీసులు .

    పోలీసుల అదుపులో నలుగురు నిందితులు

    పోలీసుల అదుపులో నలుగురు నిందితులు

    డాక్టర్ ప్రియాంకా రెడ్డి హత్య కేసును పోలీసులు చేదించారు. ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నలుగురిని పోలీసులు సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టోల్ ప్లాజా దగ్గర ఈ ఘాతుకానికి పాల్పడిన వారు పక్కా ప్లాన్ తోనే ప్రియాంకా రెడ్డిని దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి హతమార్చారు. ఇక ఈ విషయాన్ని తెలంగాణ సర్కారు కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. మంత్రి సబితారెడ్డి సైతం దోషులను వదిలిపెట్టేది లేదని తేల్చిచెప్పారు. అమ్మాయిలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచన చేశారు.

    పక్కా ప్లాన్ తోనే ప్రియాంకా రెడ్డి గ్యాంగ్ రేప్, హత్య

    పక్కా ప్లాన్ తోనే ప్రియాంకా రెడ్డి గ్యాంగ్ రేప్, హత్య

    ప్రియాంకా రెడ్డిని అత్యాచారం చేసి హతమార్చిన నలుగురు మానవ మృగాలను పోలీసులు అరెస్టు చేశారు. టోల్ ప్లాజా వద్ద ఉన్న డ్రైవర్, క్లీనర్ తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. వీరు రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ప్రియాంక రెడ్డి వాహనాన్ని పార్క్ చేయడం చూసిన వీరు పక్కా ప్లాన్ తో ఆమె స్కూటీ కి పంచర్ చేశారని, ఇక ఆ తర్వాత ప్రియాంక రెడ్డి తిరిగి వచ్చి వెహికల్ తీస్తున్న క్రమంలో పంచర్ అయింది అని చెప్పి, పంచర్ చేయిస్తామని మాయమాటలు చెప్పి డ్రామాలు ఆడారు .

    కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు,, మానవ మృగాల విచారణ

    కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు,, మానవ మృగాల విచారణ

    ఆ తర్వాత పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లారీలను అడ్డుపెట్టి దారుణంగా గ్యాంగ్ రేప్ చేశారని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే సిసిటివి ఫుటేజ్ ఆధారంగా అనుమానితులను పట్టుకున్న పోలీసులు,వారిని విచారిస్తున్నారు. ఇక వారికి మరో వ్యక్తి సహకరించినట్టుగా పోలీసులు గుర్తించారు. ప్రియాంకా రెడ్డిని దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి హతమార్చిన దుండగులు ఆమె మృత దేహాన్ని లారీలో వేసుకుని 28 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అండర్ పాస్ వద్ద పెట్రోల్ పోసి తగలబెట్టారు. అయితే వీళ్ళు పెట్రోల్ ఎక్కడ కొనుగోలు చేశారో కూడా పోలీసులు గుర్తించారు. ఈ కేసును త్వరలో తేల్చి దోషులకు శిక్ష పడేలా చేస్తామని చెప్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+