నాలుగడుగులు వెనక్కి వేసిన KCR?
తెలంగాణ గడ్డపై నుంచే భారతీయ జనతాపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ఎల్.సంతోష్ భారత రాష్ట్ర సమితికి హెచ్చరికలు జారీచేశారు. అయితే బీఆర్ఎస్ నాయకులెవరూ స్పందించలేదు. దీనిపై ఒక్క నాయకుడు కూడా మాట్లాడకుండా మౌనం వహించారు. ఈ మౌనం వ్యూహాత్మకమా? మరేదన్నానా అని సీనియర్ రాజకీయవేత్తలు విశ్లేషిస్తున్నారు. వీరే కాకుండా పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా విభాగం కూడా మౌనం వహించింది.

ఇంకా కేసు నమోదు చేయని సీబీఐ
ఎమ్మెల్యేలకు ఎరకు సంబంధించిన కేసును తెలంగాణ హైకోర్టు సీబీఐకి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సీబీఐ ఇంకా కేసు నమోదు చేయలేదు. అలాగే బీఆర్ఎస్ కూడా వెంటనే డివిజన్ బెంచ్ కు కానీ, సుప్రీంకోర్టుకు కానీ వెళ్లలేదు. ఏం జరుగుతుందో చూద్దామని ఎదురు చూస్తున్నట్లుగా ఉంది. 30వ తేదీన రోహిత్ రెడ్డి ఈడీ ఎదుట హాజరవలేదు. కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే, కేంద్ర పెద్దలకు ఎదురు తిరిగితే ఏమవుతుందో పలు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు చవిచూశారు.

మహారాష్ట్రలో కూలిన ప్రభుత్వం
తెలంగాణ సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్రలో కేంద్రానికి ఎదురు తిరిగిందనే ఉద్దేశంతో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని పడగొట్టారు. అంతేకాదు.. ముగ్గురు కీలక నేతల్ని కూడా జైలుకు పంపించారు. ఆర్నాబ్ విషయంతోపాటు షారుఖ్ ఖాన్ కుమారుడి కేసు విషయంలో ఎదురు తిరిగిన మంత్రిని దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్నాయనే నెపంతో అరెస్ట్ చేశారు. హోం మంత్రి దేశ్ ముఖ్ కూడా జైలుకు వెళ్లాల్సి వచ్చింది. సంజయ్రౌత్ ను కూడా వదలిపెట్టలేదు. చివరకు మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వం ఎలా కూలిపోయిందో మనందరం చూశాం.

తెలంగాణపై బీజేపీ దృష్టి
బీఎల్ సంతోష్ హెచ్చరికలతో కేంద్రం దృష్టి తెలంగాణ మీద ఉందని అర్థమవుతోంది. ఓ దశలో తెలంగాణ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరిగింది. బీఆర్ఎస్ నేతలు వ్యూహాత్మక మౌనంలో ఉన్నప్పటికీ బీజేపీ తరువాత ఏం చేయబోతుందనే సందేహం వారిని వెంటాడుతోంది. ఎమ్మెల్యే కొనుగోళ్లకు సంబంధించిన కేసు సీబీఐ చేతికి వెళ్లిన తర్వాత కేసీఆర్ వద్ద ఎటువంటి ఆయుధాలు లేవు. కానీ అటువంటి ఆయుధాలు కేంద్ర ప్రభుత్వం దగ్గర భారీసంఖ్యలో ఉన్నాయి. వాటితో కేంద్రం దాడిచేస్తే బీఆర్ఎస్ ఇబ్బంది పడటం ఖాయమనే ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం దూకుడుగా వెళ్లడంకన్నా సంయమనం పాటించడం మంచిదనే భావనలో ఆ పార్టీ నేతలున్నారు. బీజేపీ అగ్రనేతలను రెచ్చగొట్టకూడదనే వ్యూహాన్ని బీఆర్ఎస్ అమలు చేస్తోందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications