కేసీఆర్ రాజీనామా అస్త్రం..!? సంచలన వ్యూహం- టార్గెట్ రేవంత్..!!

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం. ఒక వైపు ప్రభుత్వం... అధికార కాంగ్రెస్ లో కొండా సురేఖ వ్యవహారం పైన కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మంత్రివర్గ ప్రక్షాళన ఖాయమైన వేళ ఢిల్లీ కేంద్రంగా హైకమాండ్ తో పార్టీ నేతల మంత్రాంగం కొనసాగుతోంది. ఇటు గ్రేటర్ ఎన్నికలకు సన్నాహకాలు మొదలు పెట్టారు. ఇదే సమయంలో మాజీ సీఎం కేసీఆర్ అనూహ్య నిర్ణయానికి సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. తన మార్క్ రాజకీయంతో సీఎం రేవంత్ ను ఆత్మరక్షణలోకి నెట్టాలని భావిస్తున్నారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనను రాజకీయ బ్రహ్మాస్త్రం సీఎం రేవంత్ పైప సంధించేందుకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో తాజాగా సీఎం రేవంత్ తన ప్రసంగంలో కేసీఆర్ కు ఛాలెంజ్ విసిరారు. కీలక వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్‌కు..తనకు పోలిక ఏంటని ప్రశ్నించారు. ఈ వెయ్యి రోజుల్లో జనం కోసం కేసీఆర్ ఒక్కసారైనా బయటకు వచ్చారా అంటూ నిలదీసారు. ఈ వెయ్యి రోజుల్లో ప్రధాన ప్రతిపక్ష నేత రూ.22.24 కోట్ల ప్రభుత్వ వేతనం తీసుకున్నారని వివరించారు. ప్రధాన ప్రతిపక్ష నేత రాజీనామా డిమాండ్ తో ఆందోళనలు చేయాలని రేవంత్ పిలుపునిచ్చారు. దీంతో.. కేసీఆర్ ఈ వ్యవహారం పైన సీరియస్ గా ఆలోచన చేస్తున్నట్లు పార్టీ నేతల సమాచారం. రేవంత్ చేసిన రాజీనామా డిమాండ్ ను అంగీకరించి.. ఉప ఎన్నిక కోసం ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గజ్వేల్ ఎమ్మెల్యేగా రాజీనామా దిశగా కేసీఆర్ సిద్దం అవుతున్నారనే ప్రచారం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

సురేఖపై కీలక నిర్ణయం: కేబినెట్ ప్రక్షాళనకు హైకమాండ్ ఆమోదం- ఇన్, ఔట్ వీరే..!!
సురేఖపై కీలక నిర్ణయం: కేబినెట్ ప్రక్షాళనకు హైకమాండ్ ఆమోదం- ఇన్, ఔట్ వీరే..!!
brs-chief-kcr-likely-to-announce-sensational-decision-amid-cm-revanth-reddy-recent-challenge-here

అసెంబ్లీ సమావేశాల వేళ కీలక మంత్రాంగం

ఈ నెల 7వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశానికి హాజరై సభా వేదికగానే కేసీఆర్ తన రాజీనామా నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదే జరిగితే రాజకీయంగా రాష్ట్రంలో ఈ నిర్ణయం కీలక మలుపుగా మారే అవకాశం కనిపిస్తోంది. కేసీఆర్ రాజకీయంగా బలహీన పడిన ప్రతీ సందర్భంలో రాజీనామా అస్త్రమే ఆయన్ను తిరిగి బలోపేతం చేసింది. రాజీనామా చేస్తూనే రేవంత్ వెయ్యి రోజుల పాలనకు రిఫరెండంగా గజ్వేల్ ఉప ఎన్నికను ప్రకటించే విధంగా వ్యూహం సిద్దం చేస్తున్నట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. అయితే, ఇదే సమయంలో మరో చర్చ సాగుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తూ వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ రాజీనామా నిర్ణయం తీసుకుంటే.. రేవంత్ సమర్థతకు పరీక్షగా మారుతోంది. గజ్వేల్ లో గెలుపు కోసం రేవంత్ అన్ని రకాల ప్రయత్నాలు చేయటం ఖాయం. అక్కడి ఫలితం కేసీఆర్ - రేవంత్ నాయకత్వానికి సవాల్ గా మారటం ఖాయమనే విశ్లేషణలు ఉన్నాయి. దీంతో.. ఈ వ్యవహారం పైన కేసీఆర్ తీసుకునే నిర్ణయం రాష్ట్రం లో ఇప్పుడు రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+