బీఆర్ఎస్‌కు మరో షాక్: కాంగ్రెస్‌లో చేరిన ఇంద్రకరణ్ రెడ్డి

లోక్‌సభ ఎన్నికల ముందు మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి బుధవారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపించారు. అంతేగాక, కాంగ్రెస్ గూటికి చేరారు.

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ దీపా మున్షీ సమక్షంలో ఇంద్రకరణ్ రెడ్డి హస్తం పార్టీలో చేరారు. ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోగా.. తాజాగా ఈ మాజీ మంత్రి కూడా పార్టీని వదలడం ఆ పార్టీని కొంత ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టినట్లయింది.

BRS leader Indrakaran Reddy joins Congress party

కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిషేధం

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎన్నికల ప్రచారంపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఎన్నికల ప్రచారంలో అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సీరియస్ అయ్యింది. ఈ క్రమంలోనే కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటలపాటు నిషేధం విధించింది ఎన్నికల సంఘం.

ఇటీవల సిరిసిల్లలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు అందడంతో పరిశీలించిన అనంతరం ఎన్నికల సంఘం ఈ మేరకు చర్యలు తీసుకుంది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి 48 గంటలపాటు ఈ నిషేధం అమలులో ఉండనుంది.

కాంగ్రెస్​ నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని నిరంజన్​ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈసీ నిషేధం విధించింది. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసీఆర్‌​పై చర్యలకు ఈసీ చర్యలు తీసుకుంది.

ఈసీ నిషేధం స్పందించిన కేసీఆర్

ఎన్నికల సంఘం నిషేధం విధించడంపై కేసీఆర్ స్పందించారు. నా మాట‌ల‌ను అధికారులు స‌రిగా అర్థం చేసుకోలేదు. స్థానిక మాండ‌లికాన్ని అధికారులు అర్థం చేసుకోలేదు. కాంగ్రెస్ నేత‌లు కొన్ని వ్యాఖ్య‌ల‌ను ఎంపిక చేసుకొని ఫిర్యాదు చేశారు. నా వ్యాఖ్య‌ల‌కు ఇంగ్లీష్ అనువాదం స‌రికాదు. కాంగ్రెస్ విధానాలు, హామీల అమ‌ల్లో వైఫ‌ల్యాన్నే ప్ర‌స్తావించాను అని కేసీఆర్ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+