నెక్స్ట్ జరిగేది ఇదే, కేటీఆర్ సంచలనం..!!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోరు ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఎన్నికల ప్రచారం తుది దశ కు చేరింది. గెలుపు కోసం ముఖ్య నేతలకు ప్రధాన పార్టీలు బరిలోకి దించాయి. ఫార్వార్డ్ బ్లాక్ నుంచి పోటీలో ఉన్న కవిత పార్టీ అభ్యర్ధులకు దక్కే ఓట్లు బీర్ఎస్ పైన ప్రభావం చూపే అవకాశం ఉందనే విశ్లేషణలు ఉన్నాయి. ఇదే సమయంలో సీఎం రేవంత్ తన ప్రసంగాల్లో మాజీ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు. కాగా.. కేటీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం రేపటితో ముగియనుంది. సీఎం రేవంత్ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకొని ప్రచారం కొనసాగిస్తున్నారు. అటు బీఆర్ఎస్ సైతం రేవంత్ ను లక్ష్యంగా చేసుకుంది. ఇదే సమయంలో మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఉద్యోగాల పేరుతో యువతను కాంగ్రెస్‌ మోసం చేసిందని విమర్శించారు. మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే అని ఆయన స్పష్టం చేశారు. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజల ను మోసం చేశారని మండిపడ్డారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని రేవంత్‌ ప్రగల్భాలు పలికారని చెప్పారు. రేవంత్ పాలనలో యూరియా కష్టాలు తప్పడం లేదని అన్నారు. చెప్పులు క్యూలైన్లలో పెట్టి ఎదురు చూడాల్సిన దుస్థితి దాపురించిందని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఎప్పుడూ యూరియా కొరత లేదని మండిపడ్డారు. రైతుబంధు అడిగితే.. లాగులో తొండలు విడుస్తానని అంటున్నారని విమర్శించారు.

brs-leader-ktr-express-confidence-over-party-winning-in-next-elections-targets-cm-revanth-in-campai

హామీలు ఇచ్చి మోసం చేసారు

అదే విధంగా రెండున్నరేళ్లుగా సంక్షేమాభివృద్ధి లేక ప్రజలు గోసపడుతున్నారని తెలిపారు. బతుక మ్మ చీర లేదు.. కేసీఆర్‌ కిట్‌ లేదని విమర్శించారు. ప్రతి పంటకు రూ.500 బోనస్‌ ఇస్తామ ని బోగస్‌ మాట చెప్పారని మండిపడ్డారు. ఫిబ్రవరి 8వ తేదీకి కూడా రైతుబంధు పడలేదని తెలి పారు. వృద్ధులకు రూ.4వేల పింఛన్‌ ఇస్తామని మోసం చేశాడని అన్నారు. అత్తకు, కోడలికి ఇద్దరికీ రూ.2500 ఇచ్చిండా అని ప్రశ్నించారు. తులం బంగారం, రూ.4వేల పింఛన్‌, విద్యా భరోసా, నిరుద్యోగ భృతి, మహిళలకు రూ.2500, స్కూటీలు ఇస్తామని అనేక హామీలు ఇచ్చిండని అన్నారు. కాంగ్రెస్‌ అడ్డగోలు హామీలు నమ్మి ప్రజలు మోసపోయిండని అన్నారు. అరచేతిలో వైకుంఠం చూపి అభయహస్తం చూపారని.. అది అభయహస్తం కాదని.. భస్మాసుర హస్తమని అన్నారు. హామీలపై నిలదీస్తే కేసులు పెడుతున్నారని తెలిపారు. ఎన్ని కేసులు పెట్టిన భయపడమని స్పష్టం చేశారు. 420 హామీలు అమలయ్యే దాకా ప్రశ్నిస్తూనే ఉంటామని కేటీఆర్ తేల్చి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+