గొడ్డళ్ళతో నరికి బీఆర్ఎస్ నేత దారుణహత్య: జూపల్లికి వార్నింగ్; భగ్గుమన్న హరీష్ రావు!!
తెలంగాణ రాష్ట్రంలో వనపర్తి జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం చిన్నంబావి మండలం లక్ష్మీ పల్లిలో బిఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. గత రాత్రి లక్ష్మీ పల్లిలో శ్రీధర్ రెడ్డిని దారుణంగా గొడ్డలితో నరికి హతమార్చారు. అయితే రాజకీయ విద్వేషాల కారణంగా హత్య జరిగిందని బిఆర్ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలు చేస్తుందని ఆరోపిస్తున్నారు.
కాంగ్రెస్ హత్యా రాజకీయాలు మొదలు పెట్టింది
గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హత్య రాజకీయాలకు తెర తీసిందని ఆరోపిస్తున్నారు.బీఆర్ఎస్ పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలు చేస్తుందని మండిపడింది. గతంలో తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా, బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక హత్యా రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టిందని ఆరోపించింది.

మంత్రి జూపల్లికి వార్నింగ్ ఇచ్చిన బీఆర్ఎస్
వనపర్తి జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో బీఆర్‌ఎస్ నాయకుడు శ్రీధర్‌రెడ్డి దారుణహత్య ఘటన కాంగ్రెస్ ప్రేరేపిత హత్యా అని పేర్కొంది. బీఆర్ఎస్ నాయకులపై.. కాంగ్రెస్ నాయకులు వరుసగా అరాచకాలు, దాడులు చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించింది. కబడ్ధార్ మంత్రి జూపల్లి కృష్ణారావు.. ఈ హత్యా రాజకీయాలు ఆపకపోతే ప్రజలే నీకు సరైన గుణపాఠం చెబుతారు అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
బీఆర్ఎస్ నేత హత్యపై భగ్గుమన్న హరీష్ రావు
బీఆర్ఎస్ నాయకుడి హత్య ఘటనపై స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం లక్ష్మిపల్లిలో బిఆర్ఎస్ మండల నాయకులు శ్రీధర్ రెడ్డి దారుణ హత్యకు గురికావడం దారుణం అని అభిప్రాయపడ్డారు. మృతుని కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 5నెలల్లో ఒక్క కొల్లాపూర్ నియోజకవర్గంలోనే ఇద్దరు బిఆర్ఎస్ నాయకులు హత్యకు గురికావడం, పలుచోట్ల నేతలు, కార్యకర్తలపై దాడులు జరగటం దురదృష్టకరమన్నారు.

రాజకీయ ప్రేరేపిత హత్య పై విచారణకు హరీష్ డిమాండ్
ప్రజాస్వామ్యంలో హత్యారాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు. ప్రశ్నించే గొంతుకలను బెదిరింపులతో కాంగ్రెస్ ప్రభుత్వం భయపెట్టలేదు అని తేల్చి చెప్పారు. బిఆర్ఎస్ కార్యకర్తలు మనో ధైర్యాన్ని కోల్పోవద్దన్నారు. పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందని, రాజకీయ ప్రేరేపిత హత్య పై తక్షణం విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామని హరీష్ రావు తెలిపారు.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications