కేసీఆర్ పార్టీకి మరో బిగ్ షాక్: కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు!
లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరగా.. తాజాగా మరికొందరు కూడా పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. తాజాగా, మహబూబాబాద్ లోక్‌సభ పరిధిలో కాంగ్రెస్ విజయాన్ని ఆకాంక్షిస్తూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఇల్లందులో లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది.
అయితే, ఈ కార్యక్రమానికి హస్తం పార్టీ నాయకులు, కార్యకర్తలతోపాటు భద్రాచలం బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు(Tellam Venkata Rao) పాల్గొనటంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతోంది. దీంతో భద్రాచలం శాసన సభ్యుడు తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయమైనట్లుగానే తెలుస్తోంది.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన తెల్లం వెంకట్రావు కొంతకాలంగా సొంత పార్టీతో అంటీముట్టనట్టుగా వ్యహహరిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఛలో మేడిగడ్డ కార్యక్రమం, పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధత సమావేశాలకు కూడా దూరంగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే.
నాటి నుంచి తెల్లం కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతూ వచ్చారు. ఇటీవల మణుగూరు కాంగ్రెస్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తమతో కలిసి నడుస్తానంటూ వచ్చారని పేర్కొనడం గమనార్హం. ఈ క్రమంలో తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరికకు ముహూర్తం ఖరారైందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఏప్రిల్ 6న రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల శంఖారావ బహిరంగ సభ జరగనుంది.
ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. ఇక, ఈ సభలోనే రాహుల్ గాంధీ సమక్షంలో తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ గూటికి చేరుతారని సమాచారం. ఇందు కోసం భద్రాచలం నుంచి తనతో పాటు పలువురు నాయకుల్ని తీసుకుని వెళ్లేందుకు తెల్లం ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలిసింది. లోక్‌సభ ఎన్నికల ముందు తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరితే బీఆర్ఎస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లే.
-
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !!











Click it and Unblock the Notifications