కేటీఆర్, హరీశ్ రావు కీలక భేటీ: 54 నియోజకవర్గాలకు బీఆర్ఎస్ ఇంఛార్జీలు వీరే

హైద‌రాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న క్రమంలో అధికార బీఆర్ఎస్ పార్టీ దూకుడు కొనసాగిస్తోంది. తాజాగా, 54 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు బీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జిల‌ను నియ‌మించింది. ఈ సంద‌ర్భంగా నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జీలతో మంత్రులు కేటీఆర్, హ‌రీశ్‌రావు వ‌ర్చువ‌ల్‌గా స‌మావేశం నిర్వ‌హించారు. బీఆర్ఎస్ విజ‌యానికి అనుస‌రించాల్సిన కార్యాచ‌ర‌ణ‌పై కేటీఆర్, హ‌రీశ్‌రావు వారికి దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్ఎస్‌కు సానుకూల వాతావ‌ర‌ణం ఉంద‌న్నారు. కేసీఆర్ నాయ‌క‌త్వానికి ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నార‌న్నారు. ప‌దేళ్ల అభివృద్ధిని రాష్ట్రంలోని ప్ర‌తి గ‌డ‌ప‌కు తీసుకెళ్లి ఓట్లు అడ‌గాల‌ని సూచించారు. విప‌క్షాల‌కు ఎన్నిక‌లు కేవ‌లం హామీలు ఇచ్చే వేదిక‌లు.. బీఆర్ఎస్‌కు ఎన్నిక‌లంటే ప‌దేళ్ల ప్ర‌గ‌తిని వివ‌రించే అవ‌కాశమ‌ని తెలిపారు.

brs party appointment in charges for 54 assembly constituencies

సంక్షేమం, అభివృద్ధి ఫ‌లాలు అందుకున్న ప్ర‌తి ఒక్క‌రితో మ‌మేకం కావాల‌ని కేటీఆర్ సూచించారు. అనంతరం మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. పార్టీ శ్రేణుల‌ను స‌మ‌న్వ‌యం చేసుకొని ప్ర‌చారం నిర్వ‌హించాల‌న్నారు. ప‌క‌డ్బందీ ప్ర‌ణాళిక‌తో ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించి, బీఆర్ఎస్ గెలుపున‌కు కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు. గ‌తం కంటే అత్య‌ధిక స్థానాల‌ను గెలిచేలా కృషి చేయాల‌న్నారు.

బీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జిలు వీరే:
1. బెల్లంప‌ల్లి - ఎంపీ వెంక‌టేశ్ నేత‌
2. మంచిర్యాల - ఎమ్మెల్సీ భానుప్ర‌సాద్
3. ఖానాపూర్ - ఎమ్మెల్సీ దండె విఠ‌ల్
4. బోథ్ - మాజీ ఎంపీ న‌గేశ్
5. ముదోల్ - మాజీ ఎమ్మెల్సీ పురాణం స‌తీశ్ కుమార్
6. బోధ‌న్ - ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌
7. ఎల్లారెడ్డి - మాజీ ఎమ్మెల్సీ వీ గంగాధ‌ర్ గౌడ్
8. కామారెడ్డి - ఎమ్మెల్యే గంప గోవ‌ర్ధ‌న్, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మంత్రి కేటీఆర్
9. నిజామాబాద్ అర్బ‌న్ - ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌
10. జ‌గిత్యాల - ఎమ్మెల్సీ ర‌మ‌ణ‌, మాజీ మంత్రి రాజేశం గౌడ్
11. రామ‌గుండం - మాజీ ఎమ్మెల్సీ నార‌దాసు ల‌క్ష్మ‌ణ్‌
12. మంథ‌ని - ఈద శంక‌ర్ రెడ్డి
13. పెద్ద‌ప‌ల్లి - చైర్మ‌న్ ర‌వీంద‌ర్ సింగ్
14. చొప్ప‌దండి - మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్
15. వేముల‌వాడ - మాజీ ఎంపీ వినోద్ కుమార్
16. మాన‌కొండూరు - సుడా చైర్మ‌న్ జీవీ రామ‌కృష్ణ‌
17. మెద‌క్ - కే తిరుప‌తి రెడ్డి
18. ఆందోల్ - మాజీ ఎమ్మెల్సీ ఫ‌రూఖ్ హుస్సేన్
19. న‌ర్సాపూర్ - ఎమ్మెల్సీ వెంక‌ట‌రాం రెడ్డి
20. జ‌హీరాబాద్ - మాజీ ఎమ్మెల్సీ దేవీ ప్ర‌సాద్
21. సంగారెడ్డి - చైర్మ‌న్ వీ భూపాల్ రెడ్డి, చైర్మ‌న్ ఎర్రోళ్ల శ్రీనివాస్
22. దుబ్బాక - చైర్మ‌న్ బాల‌మ‌ల్లు
23. గ‌జ్వేల్ - మంత్రి హ‌రీశ్ రావు, ఎమ్మెల్సీ యాద‌వ రెడ్డి, చైర్మ‌న్ ప్ర‌తాప్ రెడ్డి
24. మ‌ల్కాజ్‌గిరి - ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
25. ఉప్ప‌ల్ - చైర్మ‌న్ రావుల శ్రీధ‌ర్ రెడ్డి
26. ఇబ్ర‌హీంప‌ట్నం - మాజీ ఎమ్మెల్యే తీగ‌ల కృష్ణా రెడ్డి
27. చేవెళ్ల - ఎంపీ రంజిత్ రెడ్డి
28. వికారాబాద్ - ఎంపీ రంజిత్ రెడ్డి
29. ముషీరాబాద్ - ఎమ్మెల్సీ ఎంఎస్ ప్ర‌భాక‌ర్
30. అంబ‌ర్‌పేట్ - క‌ట్టెల శ్రీనివాస్ యాద‌వ్, అడ్వ‌కేట్ మోహ‌న్ రావు
31. సికింద్రాబాద్ కంటోన్మెంట్ - మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్
32. మ‌క్త‌ల్ - చైర్మ‌న్ ఆంజ‌నేయులు గౌడ్
33. గ‌ద్వాల్ - మాజీ చైర్మ‌న్ రాకేశ్ చిరుమ‌ళ్ల‌
34. అలంపూర్ - ఎమ్మెల్సీ చ‌ల్లా వెంక‌ట్రామ్ రెడ్డి
35. అచ్చంపేట - చైర్మ‌న్ ఇంతియాజ్ ఇషాక్
36. క‌ల్వ‌కుర్తి - చైర్మ‌న్ గోలి శ్రీనివాస్ రెడ్డి
37. కొల్లాపూర్ - ఎంపీ రాములు
38. నాగార్జున సాగ‌ర్ - ఎమ్మెల్సీ కోటి రెడ్డి, రామ‌చంద్ర నాయ‌క్
39. హుజుర్ న‌గ‌ర్ - విజ‌య‌సింహా రెడ్డి
40. కోదాడ - ఎమ్మెల్సీ టీ ర‌వీంద‌ర్ రావు
41. న‌ల్ల‌గొండ - జ‌డ్పీ చైర్మ‌న్ బండా న‌రేంద‌ర్ రెడ్డి
42. న‌కిరేక‌ల్ - ఎంపీ బడుగుల లింగ‌య్య యాద‌వ్
43. జ‌న‌గామ - మాజీ ఎమ్మెల్సీ బీ వెంక‌టేశ్వ‌ర్లు, చైర్మ‌న్ రాజ‌య్య‌, మంత్రి హ‌రీశ్‌రావు
44. మ‌హ‌బూబాబాద్ - మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్
45. న‌ర్సంపేట - చైర్మ‌న్ వీ ప్ర‌కాశ్
46. వ‌రంగ‌ల్ ఈస్ట్ - మండ‌లి డిప్యూటీ చైర్మ‌న్ బండా ప్ర‌కాశ్
47. భూపాల‌ప‌ల్లి - ఎమ్మెల్సీ బ‌స‌వ‌రాజు సార‌య్య‌
48. ములుగు - ఎమ్మెల్సీ పోచంప‌ల్లి శ్రీనివాస్ రెడ్డి
49. ఇల్లందు - ఎంపీ వ‌ద్దిరాజు ర‌విచంద్ర‌
50. మ‌ధిర - మంత్రి పువ్వాడ అజ‌య్, కొండ‌బాల కోటేశ్వ‌ర్ రావు
51. వైరా - ఎంపీ నామా నాగేశ్వ‌ర్ రావు
52. స‌త్తుప‌ల్లి - ఎంపీ పార్థ‌సార‌థి రెడ్డి
53. అశ్వ‌రావుపేట - శేష‌గిరావు(ఖ‌మ్మం డీసీఎంఎస్)
54. భ‌ద్రాచ‌లం - ఎమ్మెల్సీ తాత మ‌ధు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+