లోక్ సభ ఎన్నికలకు బీఆర్ఎస్ వ్యూహం.. పోటీపై కేసీఆర్ సంచలన నిర్ణయం!!
అనువుగాని చోట అధికులమనరాదు.. కొంచెముండుటెల్ల కొదువ కాదు.. అన్న పద్యాన్ని సరిగ్గా అర్థం చేసుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లోక్సభ ఎన్నికలను ఉద్దేశించి ఆచి తూచి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలోని తాజా పరిస్థితులను బట్టి లోక్ సభ ఎన్నికల కోసం సంచలన నిర్ణయం తీసుకున్నారు.
తాజాగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో జరిగిన కీలక సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో పరాజయం పాలైన తర్వాత కెసిఆర్ దేశ రాజకీయాలపైన ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఫోకస్ పెట్టొద్దు అని నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే లోక్సభ ఎన్నికలకు తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిమితం కావాలని కెసిఆర్ భావిస్తున్నారని విశ్వసనీయ వర్గాల భోగట్టా.

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పాలు కావడం, కేంద్రంలోని బిజెపి అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవంతో విపరీతమైన మైలేజ్ దక్కించుకోవడం, మరోవైపు రాహుల్ గాంధీ సాగిస్తున్న యాత్ర, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ దూకుడు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్న కెసిఆర్ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో దేశ రాజకీయాలపై దృష్టి పెట్టడం అంత మంచిది కాదని భావిస్తున్నారని సమాచారం.
ఇంట గెలిచి రచ్చ గెలవాలని ఆలోచనలో ఉన్న కేసీఆర్ అందులో భాగంగా 16 ( ఎంఐఎం 1) పార్లమెంటు స్థానాలలో కనీసం 12 నుండి 15 స్థానాలలో విజయం దక్కించుకునేలా ఫోకస్ చేయనున్నట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు పుంజుకుంటున్న నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల్లో ఈ రెండు పార్టీలను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి కెసిఆర్ ప్లాన్ చేస్తున్నారు.
ఈసారి ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించాలని అధికార కాంగ్రెస్ వ్యూహాలను సిద్ధం చేస్తుంది. దీంతో లోక్సభ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పార్టీ అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోతే, భవిష్యత్తు ఇబ్బందికరంగా మారుతుందని భావిస్తున్న కెసిఆర్ ఈ క్రమంలోనే లోక్సభ ఎన్నికలకు తెలంగాణ కు మాత్రమే పరిమితం కావాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్












Click it and Unblock the Notifications