సోదరుడని నమ్మితే.. వేట కొడవళ్ళతో నిండుగర్భిణీ దారుణహత్య; ఈ స్టోరీ తెలిస్తే షాకవ్వటం పక్కా!!
గచ్చిబౌలి లో దారుణ ఘటన చోటుచేసుకుంది. నిండు గర్భిణి అని కూడా చూడకుండా ఒక మహిళను వేటకొడవళ్లతో హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. తన భార్య తన నుంచి వేరు కావడానికి బామ్మరిది వెంకట రామకృష్ణ కారణమని భావించి అతనిని హతమార్చాలని ప్లాన్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్లిన నిందితుడు నిండు గర్భవతి అని కూడా చూడకుండా బామ్మరిది భార్యను హతమార్చిన ఘటన ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. ఇంతకు ఏం జరిగిందంటే

నిండు గర్భిణీ ప్రాణం తీసిన ఓ పంచాయితీ
కొండాపూర్లోని జేవీజీ హిల్స్ డియల్ టవర్స్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న వెంకట రామకృష్ణ ఆయన భార్య స్రవంతితో కలిసి నివాసముంటున్నారు. వీరికి ఒక కుమార్తె కాగా, ప్రస్తుతం స్రవంతి మళ్లీ ఎనిమిది నెలల గర్భవతిగా ఉన్నారు. ప్రశాంతంగా సాగిపోతున్న వీరు జీవితంలో ఓ చిన్న పంచాయతీ చిచ్చుపెట్టింది. వెంకట రామకృష్ణ చిన్నమ్మ కూతురు అయిన లక్ష్మీప్రసన్న భార్య భర్తల పంచాయితీ వెంకట రామకృష్ణ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది.

భార్యాభర్తల మధ్య గొడవ: చిన్నమ్మ కూతురు కోసం పంచాయితీ
తన చిన్నమ్మ కూతురైన లక్ష్మీప్రసన్న భార్యాభర్తల మధ్య గొడవలు చోటుచేసుకోవడంతో, ఈ విషయంలో పంచాయతీ చేసిన వెంకట రామకృష్ణ లక్ష్మీ ప్రసన్న భర్త శ్రీ రామకృష్ణ పెళ్లయిన నాటినుండి భార్యను అనుమానంతో వేధిస్తూ ఉండడంతో అతనిని గట్టిగా మందలించాడు. ఇక ఇటీవల కొంత కాలం నుండి శ్రీ రామకృష్ణ భార్య కూడా అతనికి దూరంగా ఉంటుంది. ఇక నెల రోజుల క్రితం తన భర్త తనను వేధిస్తున్నాడని పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసింది.

బామ్మరిది వల్లే భార్య వెళ్ళిపోయిందని భావించి బామ్మరిది భార్యపై దాడి
దీంతో తన భార్య తనను వదిలి పెట్టి వెళ్ళడానికి, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెనుక బామ్మరిది వెంకట రామకృష్ణ ఉన్నాడని భావించిన శ్రీ రామకృష్ణ అతడిని చంపాలని ప్లాన్ చేశాడు. ఎర్రగడ్డలో వేట కొడవలి కొనుగోలు చేసి నేరుగా ఆయన ఇంటికి వెళ్లి తనను చంపాలని ప్రయత్నం చేశాడు. శ్రీ రామకృష్ణ ఇంట్లోకి వచ్చిన విధానం చూసి భయపడిన భార్య స్రవంతి పక్కింటి వారిని పిలవడానికి కేకలు వేస్తూ బయటకు వెళ్ళగా వేట కొడవలితో ఆమెపై దాడి చేసి అక్కడి నుండి పరారయ్యాడు.

ప్రాణాలు కోల్పోయిన నిండు గర్భిణీ.. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఆపై ఆమెను ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. 8 నెలల నిండు గర్భిణీ ప్రాణాలు కోల్పోయింది. అన్న వరుస అయిన వ్యక్తి తనకు ఏ సంబంధం లేకపోయినా వేట కొడవలితో ఓ నిండు గర్భిణిని హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇక ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు శ్రీ రామకృష్ణ ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications