ప్రేయసి కోసం.. గొంతుకోసి వారిని హతమార్చి.. బన్నీ ఘాతుకం!!
వరంగల్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చెన్నారావుపేట మండలంలోని పాపయ్యపేట శివారు 16 చింతల తండాలో ఓ భార్య భర్తల జంటను గొంతు కోసి దారుణంగా హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది . మేకల నాగరాజు బన్నీ అనే యువకుడు తన భార్య దీపిక కుటుంబంపై విచక్షణ రహితంగా కత్తితో దాడి చేసి భార్య తల్లిదండ్రులను హతమార్చాడు.
ప్రేమవివాహం చేసుకున్న కూతురు.. తల్లిదండ్రులు ఏం చేశారంటే
ఈ ఘటనలో మృతుల కుమారుడు మదన్, కుమార్తె దీపికకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే..16 చింతల తండాకు చెందిన దీపిక మహబూబాబాద్ కు చెందిన నాగరాజు అలియాస్ బన్నీ అనే యువకుడితో ప్రేమవివాహం చేసుకుంది. ఈ పెళ్లి ఇష్టం లేని యువతీ తల్లిదండ్రులు కొద్దిరోజులు క్రితం పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టి తమ కుమార్తెను తమతో తీసుకెళ్లిపోయారు.

ప్రేయసిని దూరం చేశారని ఘాతుకం
తమ కుమార్తె జోలికి రావద్దని యువకుడిపైన పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అప్పటినుంచి వారి పైన ఆగ్రహంతో ఊగిపోతున్న బన్నీ నిన్న రాత్రి 16 చింతల తండాలోని తమ ఇంట్లో నిద్రిస్తున్న వాళ్లపైన దాడికి పాల్పడ్డాడు. తల్వార్ తో ఆ కుటుంబం పైన దాడికి పాల్పడిన బన్నీ యువతి తల్లిదండ్రుల గొంతు కోశాడు. దీంతో తల్లి సంఘటన స్థలంలోనే మృతి చెందగా, తండ్రిని ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మృతి చెందాడు.
ప్రేయసి, ఆమె సోదరుడి పరిస్థితి విషమం
దీపిక, ఆమె సోదరుడు మదన్ లపైన కూడా బన్నీ విచక్షణ రహితంగా దాడికి పాల్పడడంతో ప్రస్తుతం దీపికతో పాటు ఆమె సోదరుడు తీవ్ర గాయాలతో ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మొదటవారిని నర్సంపేట ఆసుపత్రికి తరలించినా, వారి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం హత్యకు పాల్పడిన నాగరాజు అలియాస్ బన్నీ పరారీలో ఉన్నాడు.
బన్నీ కోసం పోలీసుల గాలింపు
బన్నీ కోసం పోలీసులు గాలింపు జరుపుతున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఈస్ట్ జోన్ డిసిపి రవీందర్ హత్యకు పాల్పడిన నాగరాజును అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేసినట్టుగా పేర్కొన్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications