కాల్ మెర్జింగ్ స్కామ్.. ఆ కాల్స్ మాట్లాడితే మీ సొమ్ము గోవిందా!

సమాజంలో రోజురోజుకీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. రకరకాల మోసాలతో సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాలను కొల్లగొడుతున్నారు. అసలు ఏం జరిగింది అనేది అర్థం చేసుకునే లోపే బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. సైబర్ మోసాల పైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన తీసుకురావడానికి ఎన్ని కార్యక్రమాలు చేసిన ఆ ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరుగా మారుతున్నాయి.

కాల్ మెర్జింగ్ స్కామ్
ప్రస్తుత సమాజంలో ఉన్న ట్రెండ్స్ కు తగ్గట్టు రకరకాలుగా సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త వేషం వేసుకొని మోసాలు చేస్తున్నారు. తాజాగా కాల్ మెర్జింగ్ పేరుతో సరికొత్త సైబర్ మోసానికి తెర లేపారు. కేవలం ఒక నిమిషం పాటు కాల్ చేసిన వ్యక్తిని మాటల్లో పెట్టి వారి ఖాతాను ఖాళీ చేస్తున్న పరిస్థితి ఉంది. వారి ఫోన్ నెంబర్లు, బ్యాంకు ఖాతాలు, క్రెడిట్ కార్డుల వివరాలు వివిధ మార్గాలలో సేకరించారు సైబర్ నేరగాళ్ళు.

Call merging scam with those calls from cyber criminals your money will be stolen

కాల్ మెర్జింగ్ ఎలా చేస్తారంటే
పక్కా స్కెచ్ తో వారి ప్లాన్ ను ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఏమాత్రం అది ఫేక్ కాల్ అని అర్థం కాకుండా చాలా జాగ్రత్తగా స్కెచ్ వేస్తున్నారు. ఇక ఈ కాల్ మెర్జింగ్ స్కామ్ లో పాత స్నేహితుడిని అంటూ ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వస్తుంది. మీ కాంటాక్ట్ లో ఉన్న ఒక వ్యక్తి పేరు చెప్పి మనం స్నేహితులం అని పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తారు.

కాన్ఫరెన్స్ కాల్ తో బ్యాంకు ఖాతా ఖాళీ
ఆ తర్వాత ఇద్దరి మధ్యలో ఉండే కామన్ ఫ్రెండ్స్ గురించి చర్చిస్తారు. ఆపై ఆ కామన్ ఫ్రెండ్ తో కాల్ చేయిస్తానని చెప్పి అప్పుడు కాన్ఫరెన్స్ పెట్టమని చెప్పి ఫోన్ పెట్టేస్తారు. ఆపైన మరొక కాల్ వస్తుంది ఆ కాల్ లిఫ్ట్ చేసి, ఆపై కాన్ఫరెన్స్ పెట్టగానే వారికి ఓటిపి వినపడుతుంది. ఆ తర్వాత కాల్ కట్ అవుతుంది. బ్యాంకు నుండి మీ సొమ్ము ఖాళీ అవుతుంది.

కాల్ మెర్జింగ్ తో జాగ్రత్త
అయితే ఇందులో సైబర్ నెరగాళ్లు ఏం చేస్తారంటే మీ క్రెడిట్ కార్డు వివరాలను బ్యాంకు ఖాతా వివరాలను షాపింగ్ సైట్ లో ఎంటర్ చేసి ఓటిపి వివరాలను కాల్ లో చెప్పే ఆప్షన్ పెట్టుకుంటారు. ఎప్పుడైతే కాల్ మెర్జింగ్ చేస్తారో అప్పుడు సైబర్ నేరగాళ్లకు మీ ఫోన్లో ఓటిపి వినపడుతుంది. దీంతో మీరు సైబర్ మోసానికి గురవుతారు. ఈ కాల్ మెర్జింగ్ స్కాం బారిన పడకుండా ఉండాలంటే తెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+