కిషన్ రెడ్డి కేసీఆర్ ను బలంగా ఢీ కొట్టగలరా?

అందరూ ఊహించిందే జరిగింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ స్థానంలో జి. కిషన్ రెడ్డికి బీజేపీ అధినాయకత్వం పట్టం కట్టింది. వచ్చే ఎన్నికలకు కొత్త అధ్యక్షుడి సారధ్యంలో వెళ్లాలని అధిష్టానం నిర్ణయించింది. పార్టీలో అంతర్గత కలహాలు ఎలా ఉన్నా, బండి సంజయ్ ను వ్యతిరేకించే వర్గం ఉన్నా.. ప్రస్తుత పరిస్థితులలో అధ్యక్షుడు మార్పు బిజెపికి నష్టం చేస్తుందన్న టాక్ పార్టీ శ్రేణులలోనూ, రాజకీయ వర్గాల్లోనూ వ్యక్తమవుతోంది.

కిషన్ రెడ్డి కెసిఆర్ ను బలంగా ఢీ కొట్టగలరా అన్న ప్రశ్న అందరిలోనూ ఉత్పన్నమవుతుంది. ఇదే సమయంలో కిషన్ రెడ్డికి , బండి సంజయ్ కి మధ్య ఉన్న తేడా పార్టీశ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణ కార్యకర్త నుండి అంచెలంచెలుగా ఎదిగిన కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా ఉన్నప్పటికీ, బీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్ ను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో బండి సంజయ్ కంటే ఒక అడుగు వెనకే ఉన్నారని చర్చ జరుగుతుంది.

Can bjp telangana chief Kishan Reddy fight with KCR?

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జవసత్వాలు తీసుకురావడంలో బండి సంజయ్ చేసిన కృషి చాలా ఉంది. సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి చెమటలు పట్టించిన, టెన్షన్ పుట్టించిన నేత బండి సంజయ్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే బండి సంజయ్ లా దూకుడుగా ప్రస్తుత తెలంగాణ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ముందుకు వెళ్లడంలో విఫలమవుతారేమో అన్న చర్చ జరుగుతుంది.

వచ్చేది ఎన్నికల కాలం కావడంతో, పదునైన మాటల దాడితో, కెసిఆర్ కు వెన్నులో వణుకు పుట్టించేలా కిషన్ రెడ్డి పాత్ర ఉంటుందని రాజకీయవర్గాలు భావించడం లేదు. కిషన్ రెడ్డి ప్రతీది ఆచితూచి మాట్లాడుతాడు. విమర్శలు చేసినా, ప్రభుత్వంపై యుద్ధం చేసినా ఆయన స్టైల్ వేరు. అయితే ప్రస్తుత పరిస్థితులలో కిషన్ రెడ్డి తరహా వ్యాఖ్యలు, పోరాటాలు బీఆర్ఎస్ పార్టీకి దున్నపోతు మీద వాన కురిసినట్టు ఉంటాయని చర్చ జరుగుతుంది.

పార్టీలో సీనియర్ నాయకులు, కొత్తగా వచ్చిన నాయకులు మినహాయించి మిగతావారు బండి సంజయ్ నాయకత్వాన్ని బలంగా సమర్ధించారు. కానీ ఇప్పుడు బండి సంజయ్ ను మార్చి ఆ స్థానంలో కిషన్ రెడ్డికి పట్టం కట్టడం ఎన్నికల సమయంలో ఎక్స్పరిమెంట్ అంటున్నారు రాజకీయ పార్టీల నాయకులు.

బీజేపీ అధిష్టానం ఎంతో నమ్మకంతో కిషన్ రెడ్డికి అప్పగించిన ఈ బాధ్యత ఆయన ఏ మేరకు సక్సెస్ చేస్తారు? సీఎం కేసీఆర్ ను ఆయన వచ్చే ఎన్నికల్లో బలంగా ఢీ కొడతారా? తెలంగాణ బీజేపీ లో ఏం జరగబోతుంది? అన్నది ముందు ముందు తెలియనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+