చంద్రబాబు చేయలేనిది కేసీఆర్ చేయగలరా ? ముందునుయ్యి.. వెనుక గొయ్యి ఇలా..!

తెలంగాణలో హ్యాట్రిక్ సాధించాలన్న తన కలకు ప్రధాన అడ్డంకిగా మారిన బీజేపీపై కేసీఆర్ ప్రారంభించిన పోరాటం ఇప్పుడు జాతీయ స్ధాయిలో చర్చనీయాంశమవుతోంది. గతంలో చంద్రబాబు కూడా ఇదే తరహాలో బీజేపీపై పోరాటం మొదలుపెట్టారు. చివరికి ఆయన దారుణంగా విఫలమయ్యారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా అప్పట్లో చంద్రబాబుకు సహకరించేందుకు 21 పార్టీలు ముందుకొచ్చినా ఆయన మాత్రం విఫలమయ్యారు. ఇప్పుడు కేసీఆర్ మళ్లీ అదే స్దాయిలో పోరుకు రెడీ అవుతున్నారు. కానీ కనీసం చంద్రబాబు ఫీట్ నైనా అందుకుంటారా ?

 బీజేపీపై కేసీఆర్ పోరు

బీజేపీపై కేసీఆర్ పోరు

2014 ఎన్నికల్లో తెలంగాణలో తొలిసారి అధికారం చేపట్టిన కేసీఆర్ తొలుత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కార్ తో సత్సంబంధాలే కొనసాగించారు. ప్రధాని మోడీ సాయంతో తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలని భావించారు. అదే క్రమంలో 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లే విషయంలోనూ కేంద్రం సాయం తీసుకున్నారు. అందులో గెలిచి తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత బియ్యం కొనుగోలు విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో కేంద్రంపై సమరశంఖం పూరించిన కేసీఆర్..అనంతరం దాన్ని జాతీయ స్ధాయికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. జాతీయ స్దాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.

మద్దతిచ్చేవారే కానీ కలిసొచ్చేదెవరు ?

మద్దతిచ్చేవారే కానీ కలిసొచ్చేదెవరు ?

కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్టీయే సర్కార్ పై పోరు కోసం కేసీఆర్ ఇప్పుడు ప్రాంతీయ పార్టీల్ని ఆశ్రయిస్తున్నారు. వీరిలో స్టాలిన్, ఉద్ధవ్ థాక్రే, మమత, నితీశ్, తేజస్వి.. ఇలా ఒక్కొక్కరు మద్దతిస్తామనే చెప్తున్నారు. కేసీఆర్ వెళ్లి వీరిని కలిసే సరికి ఆయనకు మద్దతు ప్రకటిస్తున్నారు. అయితే కేసీఆర్ తో కలిసి పోరాటం చేసేందుకు వీరు ఎంత మేరకు సిద్ధంగా ఉన్నారనేది తెలియదు. వీరంతా కేసీఆర్ భవిష్యత్తులో ఓ విపక్ష ఫ్రంట్ తయారు చేస్తే ఎంత వరకూ కలిసొస్తారో తెలియదు. ఇదంతా తెలియాలంటే కచ్చితంగా వచ్చే ఏడాది వరకూ ఆగాల్సిందే.

 తెలంగాణలో గెలుపే కీలకం

తెలంగాణలో గెలుపే కీలకం

ఇంకా సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉంది. ఆలోపు వచ్చే ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. వీటిలో కేసీఆర్ బీజేపీతో హోరాహోరీ పోరాడి హ్యాట్రిక్ గెలుపు సాధిస్తే సరి. లేకపోతే మాత్రం కేసీఆర్ కు ఇప్పుడు మద్దతిస్తున్న ప్రాంతీయ పార్టీల్లో ఆయనపై విశ్వాసం సన్నగిల్లుతుంది. ఇప్పటికే మోడీపై పోరాడుతున్న కేజ్రివాల్, మమత, స్టాలిన్ వంటి వారు తమ సొంత రాష్ట్రాల్లో గెలిచి ఆ తర్వాత కేంద్రంపై పోరాడుతున్నారు. అదే తరహాలోనూ కేసీఆర్ కూడా తెలంగాణలో మూడోసారి గెలిచి ఆ తర్వాత కేంద్రంపై చేసే పోరాటానికి విలువ ఉంటుంది. లేకపోతే మాత్రం ఆయా పార్టీలు కూడా కేసీఆర్ ను లైట్ తీసుకోవడం ఖాయం.

చంద్రబాబు చేదు అనుభవం

చంద్రబాబు చేదు అనుభవం

అన్నింటికంటే మించి ఒకప్పుడు తన బాస్ చంద్రబాబు గతంలో బీజేపీతో విభేదించి ఎన్టీయే నుంచి బయటికొచ్చి చేసిన ధర్మపోరాటం కేసీఆర్ కు పాఠంగా మారబోతోంది. 2019లో బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు మొదలుపెట్టిన ధర్మపోరాటానికి కేంద్రం, రాష్ట్రాల్లో 21 జాతీయ, ప్రాంతీయ పార్టీలు మద్దతిచ్చాయి. ఈ పోరులో చంద్రబాబు దారుణంగా దెబ్బతిన్నారు. దీనికి ప్రధాన కారణం కేంద్రంలో సరైన ప్రత్యామ్నాయం చూపించలేకపోవడమే. ఈ పోరులో చంద్రబాబుతో జత కట్టిన విపక్షాలు కూడా దారుణంగా దెబ్బతిన్నాయి. దీంతో చంద్రబాబు పోరు మోడీకి వ్యతిరేకంగా అతిపెద్ద విఫలయత్నంగా మిగిలిపోయింది. ఇప్పుడు కేసీఆర్ దాన్నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిందే.

 చంద్రబాబు వల్ల కానిది కేసీఆర్ చేస్తారా ?

చంద్రబాబు వల్ల కానిది కేసీఆర్ చేస్తారా ?

గతంలో చంద్రబాబు జాతీయస్ధాయిలో తన టీడీపీతో కలిపి మొత్తం 22 పార్టీల్ని కూడగట్టి బీజేపీపై ధర్మపోరాటం చేసి విఫలమయ్యారు. కేంద్రం నుంచి ఆయా పార్టీలకు ఎన్నికల సమయంలో అడ్డంకులు తప్పలేదు. కేంద్ర దర్యాప్తు సంస్ధలు వెంటాడాయి. చివరికి చంద్రబాబు ప్రయత్నం దారుణంగా విఫలమైంది. ఇప్పుడు కేసీఆర్ ను గమనిస్తే ఆయన కలుస్తున్న ప్రాంతీయ పార్టీల నేతలు ఇప్పటికే బీజేపీకు వ్యతిరేకంగా జాతీయ స్దాయిలో కూటములు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించి విఫలమైన వారే. ఇప్పుడు కేసీఆర్ వీరందరినీ ఇంత తక్కువ సమయంలో ఏకతాటిపైకి తెచ్చి తెలంగాణ ఎన్నికల్లో గెలవడం, ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీయడం సాధ్యమేనా అన్న చర్చ సాగుతోంది. అన్నింటికీ మించి జాతీయ స్ధాయిలో ప్రత్యామ్నాయం చూపించలేకపోతే మాత్రం మోడీకి వ్యతిరేకంగా ఏ కూటమికీ ఆదరణ ఉండకపోవచ్చనేది జగమెరిగిన వాస్తవం. మరి కేసీఆర్ ఈ ప్రయత్నంలో విఫలమైతే మరిన్ని చిక్కుల్లో పడటం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+