కవిత ఢిల్లీ లిక్కర్ కేసు నుండి బయటపడే అవకాశం ఉందా? బీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చ!!

ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ కేసు నుంచి బయటపడే అవకాశం ఉందా? ఈడీ విచారణ కొనసాగుతున్న సమయంలో, తన అరెస్టు అన్యాయమని సుప్రీంకోర్టు వేదికగా కవిత పోరాటం ఫలిస్తుందా? కవితను ఈడి అధికారులు విచారిస్తున్న క్రమంలో ఆమె నుంచి తీసుకుంటున్న సమాధానాలతో ఈడి ఉచ్చులో కవిత ఇరుక్కుంటుందా? పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కవితకేసును పక్కనపెట్టి బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఎన్నికలలో ముందుకు వెళ్లగలుగుతారా? అన్నది చర్చకు కారణంగా మారింది.

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత ఈడి ఉచ్చు నుండి బయట పడటానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. సుప్రీం కోర్టు పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తనను ఈడి అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ, తన రిమాండ్ ను రద్దు చేయాలని సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన కవిత, సుప్రీంకోర్టులో తనకు భారీ ఊరట దొరుకుతుందని భావిస్తున్నారు.

Can MLC Kavitha get out of the Delhi Liquor Scam Discussion in BRS

కానీ సుప్రీంకోర్టులో కూడా కవితకు చుక్కెదురు అయ్యే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ అదే కనుక జరిగితే ఈ వారం రోజుల విచారణ అనంతరం, కవితను ఈడి మళ్లీ విచారణకు తీసుకునే అవకాశం ఉంది. లేదా ఇక ఇప్పుడు జరుగుతున్న విచారణలో కీలకమైన ఆధారాలు దొరికితే కవితను జైలుకు పంపే అవకాశం ఉంది.

ఈ క్రమంలో ఇటు పార్టీ శ్రేణులలోనూ , తెలంగాణ రాష్ట్ర ప్రజలలోను కవిత కేసులో ఏం జరగబోతుంది? కవిత ఈ వ్యవహారం నుంచి బయట పడతారా? అన్న చర్చ ఆసక్తికరంగా మారింది. పార్లమెంటు ఎన్నికల సమయంలో గులాబీ బాస్ కెసిఆర్ తమపార్టీ సత్తాచాటి అత్యధిక స్థానాలు గెలుచుకొని మళ్లీ పార్టీకి పునర్వైభవం తీసుకు రావాలనుకుంటే డామిడ్ కథ అడ్డం తిరిగింది అన్నట్టు కవిత అరెస్టు వ్యవహారం ఇప్పుడు తలనొప్పిగా మారింది.

కవిత అరెస్టు వ్యవహారం నుండి కెసిఆర్ బయటకు రా గలుగుతారా? పార్లమెంటు ఎన్నికల పైన ఫుల్ ఫోకస్ పెట్టి ప్రజాక్షేత్రంలోకి వెళ్లగలుగుతారా? అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఇక బి ఆర్ ఎస్ పార్టీలో కొనసాగితే తమ పరిస్థితి ఏమిటి? తాము కూడా కేసుల్లో ఇరుక్కోవలసి వస్తుందా? అన్న అనుమానం వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ నేతలు లేకపోలేదు. ఈ క్రమంలోనే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతలు కవిత కేసును జాగ్రత్తగా గమనిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+