డ్రైవర్‌కు ఫిట్స్: షాపులోకి దూసుకెళ్లిన కారు

హైదరాబాద్: డ్రైవర్‌కు అకస్మాత్తుగా ఫిట్స్‌ రావడంతో అతను నడుతున్న వాహనం అదుపుతప్పి పక్కను ఉన్న మెడికల్‌షాపులోకి దూసుకెళ్లిన ఘటన వికారాబాద్‌లో చోటుచేసుకుంది.

అయితే పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రాణనష్టం జరగలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. డ్రైవర్‌కు ప్రథమ చికిత్స అందించి ఆస్పత్రికి తరలించారు.

ప్రేమపేరుతో మోసపోయానని మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. సిద్దిపేట మండలం తోర్నాలలో లత అనే యువతి ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రేమ పేరుతో మోసపోయనన్న బాధతోనే ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు సమాచారం.

Car rams into medical shop in Rangareddy district

ఆదిలాబాద్‌ జిల్లా భైంసా మండలం హాస్గుల్‌కు చెందిన యువరైతు కదం విజయ్‌ (35) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. 2 ఎకరాల భూమిలో సాగుచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న విజయ్‌ మూడేళ్లుగా దిగుబడులు అప్పులపాలయ్యాడు. ఈ ఏడాది కూడా పంట దిగుబడి రాకపోవడంతో మనస్తాపం చెంది పురుగు మందు తాగాడు.

అప్పులు మరో రైతన్న ప్రాణం తీశాయి. పంట పెట్టుబడి కోసం వేలకు వేలు అప్పు తెచ్చి పెట్టినా పంట దిగుబడులు సరిగా రాక.. అప్పులు తీర్చే మార్గం కనిపించక రైతులు ఉసురు తీసుకుంటూనే ఉన్నారు.

తాజాగా కొల్చారం మండలం ఘన్‌పూర్‌లో దుర్గేష్‌ అనే రైతు అప్పుల బాధను భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దుర్గేష్‌ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+