ఓటుకు నోటు కేసులో మత్తయ్యకు మళ్లీ కష్టాలు: సుప్రీం నోటీసులు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఓటుకు నోటు కేసులో జెరూసెలం మత్తయ్యకు మళ్లీ కష్టాలు ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. ఈ కేసులో మత్తయ్యకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం వేసిన ఫిటిషన్‌ను శుక్రవారం విచారించిన సుప్రీంకోర్టు నాలుగు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది.

తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి)కి కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఓటుకు నోటు కేసులో హైకోర్టు మత్తయ్యకు విముక్తి కల్పించిన విషయం తెలిసిందే. ఓటుకు నోటు కేసులో నాలుగో (ఎ4) నిందితుడైన జెరూసలేం మత్తయ్యపై తెలంగాణ ఏసీబీ నమోదుచేసిన కేసును గత నెలలో హైకోర్టు కొట్టివేసింది.

Cash for vote: SC issues notice to Mattaiah

నిరుడు మే నెలలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ శానససభ్యుడు రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా ఎసిబికి పట్టుబడిన విషయం తెలిసిందే. ఇందులో తనపై ఎఫ్‌ఐఆర్‌ను రద్దుచేయాలంటూ మత్తయ్య హైకోర్టులో 'క్వాష్‌' పిటిషన్‌ వేశారు. దీన్ని జస్టిస్‌ బి.శివశంకర్‌రావు విచారణకు స్వీకరిస్తూ అతణ్ని అరెస్టు చేయవద్దని మధ్యంతర ఆదేశాలు జారీచేశారు.

ఈ పిటిషన్‌ విచారణనుంచి న్యాయమూర్తి వైదొలగాలని కోరుతూ నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ పిటిషన్‌ వేశారు. అయితే, దీన్ని కొట్టివేస్తూ ఆయనపై నేరపూరిత కోర్టుధిక్కారం కింద నోటీసులు జారీచేశారు. దాంతోపాటు పరిస్థితులు మారిన దృష్ట్యా మత్తయ్య పిటిషన్‌పై వీడియో రికార్డింగ్‌తో రెండుపక్షాల లాయర్ల సమక్షంలో రహస్య విచారణకు అనుమతించాలని చీఫ్‌ జస్టిస్‌ను కోరారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Supreme Court has issued notice to Jeruslem Mattaiah in Telangana Telugu Desam Party (TDP) MLA Revanth Reddy's cash for vote case.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి