ఐటీ అధికారి అక్రమాస్తులు రూ.2 కోట్లు: కొడుకును హీరోగా పెట్టి సినిమా

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఇన్‌కం ట్యాక్స్ శాఖ అధికారి వెంకటేశ్వర రావు నివాసం పైన గురువారం సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంటులో అవినీతికి పాల్పడిన వెంకటేశ్వర రావుపై గత ఆరు నెలలుగా నిఘా పెట్టిన సీబీఐ అధికారులు ఈ రోజు మధ్యాహ్నం సోదాలు నిర్వహించారు.

బెంగళూరులో ఐటీ సోదాలు: రూ.4 కోట్ల కొత్త కరెన్సీ, కిలోల కొద్ది బంగారం సీజ్

హైదరాబాదులోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులోని ఆయన నివాసంపై దాడులు చేశారు. ఆయన నివాసం నుంచి అయిదు కోట్ల రూపాయల స్వాధీనం చేసుకున్నారు. ఆయనకు వివిధ ప్రాంతాల్లో అపార్టుమెంట్లు ఉన్నట్టు సీబీఐ అధికారులు గుర్తించారు.

it

కూకట్ పల్లి, మాదాపూర్, అయ్యప్ప సొసైటీల్లో ఆయనకు ఇళ్లు ఉన్నాయని వారు పేర్కొన్నారు. ఇవన్నీ ఎలా వచ్చాయనే విషయమై వారు ఆరా తీస్తున్నారు. ఆయన నివాసంలో దాదాపు రూ.2 కోట్ల విలువైన అక్రమాస్తులు గుర్తించారు.

వెంకటేశ్వర రావు ఆదాయానికి మించి 212 శాతం ఆస్తులు కూడ బెట్టినట్లు సీబీఐ గుర్తించింది. కుమారుడిని కథానాయకుడిగా పెట్టి చిత్రం నిర్మించినట్లు అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. సోదాలు సాయంత్రం దాకా కొనసాగాయి. సినిమా నిర్మాణం ద్వారా డబ్బులు సంపాదించినట్లు చూపించే ప్రయత్నం చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
ACB raids on IT officer in Hyderabad.
Please Wait while comments are loading...