తెలంగాణా నేషనల్ హైవేలపై కేంద్రం శుభవార్త!

భారతదేశం సాంకేతికంగా చాలా అడ్వాన్స్డ్ గా ముందుకు వెళుతుంది. డిజిటల్ ప్రపంచంలో దూకుడును కొనసాగిస్తుంది. ఇదేక్రమంలో తెలంగాణలోని కొత్త జాతీయ రహదారులపై అత్యాధునిక కృత్రిమమేధస్సు ఆధారిత అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను తెలంగాణలో ప్రవేశపెట్టనున్నారు. ఢిల్లీ గురుగామ్ మధ్య ద్వారకా ఎక్స్ప్రెస్ వే పైన ఏఐ ఆధారిత అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టం సక్సెస్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కూడా దీనిని అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు.

అన్ని జాతీయ రహదారులపైన ఏఐ ఆధారిత ఏటీఎంఎస్ సిస్టమ్
జాతీయ రహదారులపైన భద్రతకు మరింత భరోసా కల్పించడానికి, జాతీయ రహదారుల పర్యవేక్షణ మరియు ప్రమాదాల గుర్తింపును సులభతరం చేయడానికి ఈ సిస్టంను ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో మంజూరు చేసే, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అన్ని జాతీయ రహదారులపైన ఏఐ ఆధారిత ఏటీఎంఎస్ సిస్టమ్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సిస్టం ద్వారా జాతీయ రహదారుల పర్యవేక్షణ, ప్రమాదాల గుర్తింపు సులభతరమవుతుంది.

Center Super news Telangana National Highways are transforming as digital highways with ai support

Take a Poll

ATMS ఏర్పాటుతో డిజిటల్ హైవేలు
ఈ డిజిటల్ హైవేలను పోలీస్ మరియు రవాణా శాఖలో అనుసంధానం చేస్తారు. భవిష్యత్తులో నిర్మించే జాతీయ రహదారులను రాష్ట్ర కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేస్తారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అనేక జాతీయ రహదారుల విస్తరణ కొనసాగుతుంది. విజయవాడ హైదరాబాద్ రహదారిని నాలుగు వరుసలు నుండి ఆరు వరుసలకు విస్తరించాలని కసరత్తు చేస్తున్నారు. అయితే దీనిపైన కూడా ATMSను ఏర్పాటు చేస్తారు.

360 డిగ్రీస్ కోణంలో నిరంతర నిఘా
అంతేకాదు ఎన్ హెచ్ 44పరిధిలో నాగపూర్ హైదరాబాద్ బెంగళూరు కారిడార్ తో పాటు, ఖమ్మం దేవరపల్లి రహదారిలో కూడా ఈ సాంకేతికతను అమలు చేయనున్నారు. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర, దక్షిణ భాగాలు కూడా కేంద్రం అనుమతినిస్తే ఏఐ టెక్నాలజీ పర్యవేక్షణలోనే ఉంటాయి. ATMS లో భాగంగా డిజిటల్ హైవేల పైన ఏఐ ఆధారిత సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ఇవి 360 డిగ్రీస్ కోణంలో నిరంతర నిఘాను కొనసాగిస్తాయి.

జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు ATMS
సీటు బెల్టు పెట్టుకోకపోవడం దగ్గర నుండి, బైకులపైన ట్రిపుల్ రైడింగ్, అతివేగం వంటి అనేక ట్రాఫిక్ ఉల్లంఘనలను రికార్డ్ చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ కు సమాచారం అందిస్తాయి. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించడానికి అవకాశం ఉంటుంది. జాతీయ రహదారులపైన ప్రమాదాలు నివారించడానికి కూడా ఈ సిస్టం ద్వారా వీలు కలుగుతుంది. అంతేకాకుండా రహదారి ప్రమాదాలు, పొగ మంచు ,జంతువుల సమాచారం వంటి అనేక వివరాలను కూడా ఏఐ అందిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+