నా జీవితంతో ఆడుకుంటున్నారు.. బోరున విలపించిన బర్రెలక్క!
సోషల్ మీడియా ద్వారా బాగా ఫేమస్ అయిన బర్రెలక్క తెలంగాణ ఎన్నికల సమయంలో సృష్టించిన సెన్సేషన్ అందరికీ తెలిసిందే. ఒకే ఒక వీడియోతో రాత్రికి రాత్రే సోషల్ మీడియా సెలబ్రిటీగా మారిపోయిన బర్రెలక్క ఎన్నికలు ఏవైనా ఎన్నికలలో పోటీ చేసి నిరుద్యోగుల తరఫున ప్రతినిధిగా తన గళాన్ని వినిపించడానికి ప్రయత్నం చేసింది. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంతో పాటు, ఎంపీ ఎన్నికలలోను బర్రెలక్క పోటీ చేసింది.
బర్రెలక్క వీడియోపై అందరి దృష్టి
ఇక ఇటీవల మెగా డీఎస్సీ కోసం గ్రూప్ 2కోసం తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు చేసిన పోరాటంలోనూ తన వంతుగా ఆమె కూడా ఆందోళనలలో పాల్గొంది.తాజాగా బర్రెలక్క మరోమారు సోషల్ మీడియాలో పెట్టిన వీడియో ఇప్పుడు అందరిని మళ్లీ ఆమెపై దృష్టి మరల్చేలా చేసింది. బర్రెలక్క తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా ఎవరో ఒకవ్యక్తి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని మోసం చేసిందని కన్నడకు చెందిన ఒక ఛానల్ వార్తను ప్రసారంచేసింది.

ఫేస్ బుక్ చాటింగ్ చేసి డబ్బులు తీసుకుందని ఆరోపణ
అయితే ఆ వార్తలో తన ఫోటోలతో పాటు తన పేరును కూడా చెప్పగా, తనను మోసం చేసిందంటూ ఒక బాధితుడు చెప్తుండడంతో ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది కాస్త బర్రెలక్కకు చేరడంతో ఆ వార్త చూసి షాక్ అయిన బర్రెలక్క లబోదిబోమని రోదిస్తోంది. ఫేస్బుక్ లో చాట్ చేసి తన వద్ద నుండి డబ్బులు తీసుకుందని ఒక బాధితుడు బర్రెలక్క పైన సంచలన ఆరోపణలు చేశాడు.
తానే తప్పు చేయలేదన్న బర్రెలక్క
ఆ వీడియో చూపిస్తూ బర్రెలక్క ఆ వార్తకు తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. తాను ఎవరి దగ్గర నుండి డబ్బులు తీసుకోలేదని కన్నీళ్లు పెట్టుకుంది. అసలు తనపై ఇలా ఎందుకు ప్రచారం అవుతుందో తనకేమీ అర్థం కావడం లేదని, అతను ఎవరో కూడా తనకు తెలియదని నామీద ఎందుకు ఇలా బ్యాడ్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారని లబోదిబొమంది.
తనపేరు మీద ఫేక్ అకౌంట్స్.. నాకే పాపం తెలీదు
నా జీవితంతో ఆడుకుంటున్నారని ఏడుస్తూ చెప్పింది. పెళ్లి చేసుకుని నా బతికేదో నేను బతుకుతుంటే నన్ను ప్రశాంతంగా బతకనివ్వడం లేదని కన్నీరు మున్నీరయ్యింది. తన పేరు మీద ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లలో చాలా ఫేక్ అకౌంట్ లు ఉన్నాయని, అందులో ఎవరు వసూలు చేశారో తనకు తెలియదని, నాకే పాపం తెలీదు నన్ను అనవసరంగా బ్లేమ్ చేయకండి అంటూ బోరున విలపిస్తూ వీడియో చేసింది బర్రెలక్క. దయచేసి తన జీవితంతో ఆడుకోవద్దని విజ్ఞప్తి కూడా చేసింది.












Click it and Unblock the Notifications