Chikoti Praveen:అలా చిక్కాడో లేదో.. ఇలా బెయిల్ వచ్చేసింది..!
థాయ్‌లాండ్: మే 1వ తేదీన గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నాడంటూ థాయ్‌లాండ్ పోలీసులు కాసినో కింగ్ చీకోటి ప్రవీణ్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు మరో 93 మందిని థాయ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈరోజు థాయ్ కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. కోర్టు చీకోటి ప్రవీణ్‌తో పాటు మరో 83 మందికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో ఫైన్ విధించింది. ఫైన్ కట్టే వరకు చీకోటి ప్రవీణ్ పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవాలని సూచించింది.
ఇదిలా ఉంటే తనకు ఏ పాపం తెలియదని చీకోటి ప్రవీణ్ చెప్పాడు. తాను హాల్‌లోకి వెళ్లిన 10 నిమిషాలకే రైడింగ్ జరిగిందని వెల్లడించాడు. ఇక థాయ్‌లాండ్‌లో గ్యాంబ్లింగ్ నిషేధం అనేది తనకు తెలియదని చెప్పిన కాసినో కింగ్.. తాను ఆర్గనైజర్ కాదని తన పేరు ఎక్కడా లేదని వివరించాడు. దేవ్, సీతలు తనను ఆహ్వానిస్తేనే థాయ్‌లాండ్‌కు వచ్చినట్లు వివరించిన చీకోటి.. నాలుగు రోజులు పోకర్ టోర్నమెంట్ అంటే వచ్చినట్లు చెప్పాడు. పోకర్ అక్కడ లీగల్ అని తనకు చెప్పినట్లు వివరించాడు.

థాయ్‌లాండ్‌లోని ఓ హోటల్‌లో కాన్ఫరెన్స్ హాల్ అద్దెకు తీసుకుని గ్యాంబ్లింగ్ నిర్వహిస్తుండగా థాయ్ పోలీసులు దాడులు నిర్వహించడంతో చికోటి చిక్కాడు. చికోటి ప్రవీణ్‌తో పాటు పోలీసులు మరో 93 మందిని అరెస్టు చేశారు. ఇందులో 16 మంది మహిళలు కూడా ఉన్నారు. పారిపోయేందుకు చికోటి ప్రయత్నించగా అతన్ని పోలీసులు పట్టుకున్నారు.
గత కొద్ది రోజులుగా వార్తల్లో వినిపించని చికోటి ప్రవీణ్ పేరు మళ్లీ తెరపైకొచ్చింది.థాయ్‌లాండ్‌లోని పటాయాలో ఏప్రిల్ 27వ తేదీన హోటల్‌లో కాన్ఫరెన్స్ హాల్‌ను అద్దెకు తీసుకుని అక్కడ గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. గ్యాంబ్లింగ్ ఆడుతున్న వారిలో భారతీయులతో పాటు నేపాల్, మయన్మార్ దేశాలకు చెందిన వారు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ గ్యాంబ్లింగ్ నిర్వహణలో 32 ఏళ్ల మహిళ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications