2 ప్రశ్నాపత్రాలు లీకయ్యాయి: 320 ప్రశ్నలను విద్యార్ధులకు ఇచ్చారన్న సీఐడీ

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎంసెట్ 2 లీకేజి కేసులో మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ లీకేజీ వ్యవహారంలో కన్సల్టెన్సీ నిర్వాహకుడు విష్ణు, దళారీ తిరుమల్‌ అనే ఇద్దరు నిందితులను గురువారం అదుపులోకి తీసుకున్నట్టు సీఐడీ పోలీసులు అధికారికంగా ప్రకటించారు.

ఢిల్లీ ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఎంసెట్ 2 పేపర్లు విద్యార్ధులకు అందాయని సీఐడీ ధ్రువీకరించింది. ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న రాజగోపాల్ రెడ్డి నుంచి మరింత సమాచారం రావాల్సి ఉందని చెప్పారు. ముంబై, బెంగుళూరు కేంద్రాలుగా ఎంసెట్ 2 పేపర్లు లీకైనట్లు సీఐడీ అధికారులు విచారణలో తెలుసుకున్నారు.

 2 ప్రశ్నాపత్రాలు లీకయ్యాయి: 320 ప్రశ్నలను విద్యార్ధులకు ఇచ్చారన్న సీఐడీ

2 ప్రశ్నాపత్రాలు లీకయ్యాయి: 320 ప్రశ్నలను విద్యార్ధులకు ఇచ్చారన్న సీఐడీ

ఈ లీకేజి వ్యవహారం మొత్తం డీల్ రూ. 15 కోట్లుగా తెలిపారు. పరీక్షకు రెండు రోజుల ముందు ఐదు సిటీల్లో విద్యార్ధులకు శిక్షణ ఇచ్చారు. ఇందుకోసం 25 మంది విద్యార్ధులను బెంగుళూరుకు తీసుకెళ్లి ప్రిపేర్ చేయించారు. మొత్తం రెండు సెట్ల క్వశ్చన్ పేపర్లు లీక్ అయ్యాయని, 320 ప్రశ్నలను విద్యార్ధులకు ఇచ్చారు.

 2 ప్రశ్నాపత్రాలు లీకయ్యాయి: 320 ప్రశ్నలను విద్యార్ధులకు ఇచ్చారన్న సీఐడీ

2 ప్రశ్నాపత్రాలు లీకయ్యాయి: 320 ప్రశ్నలను విద్యార్ధులకు ఇచ్చారన్న సీఐడీ

69 మంది విద్యార్ధులు ఈ లీకేజీ వ్యవహారంలో పాలుపంచుకోగా ఒక్కో విద్యార్ధితో రూ. 30 నుంచి రూ. 40 లక్షల వరకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. అగ్రిమెంట్‌లో భాగంగా తొలుకు ఒక్కో విద్యార్ధి నుంచి రూ. 10 లక్షలను బ్రోకర్లు వసూలు చేశారు. పరీక్ష తర్వాత మిగతా సొమ్ముని చెల్లించేలా డీల్ కుదిరింది.

 2 ప్రశ్నాపత్రాలు లీకయ్యాయి: 320 ప్రశ్నలను విద్యార్ధులకు ఇచ్చారన్న సీఐడీ

2 ప్రశ్నాపత్రాలు లీకయ్యాయి: 320 ప్రశ్నలను విద్యార్ధులకు ఇచ్చారన్న సీఐడీ

హైదరాబాద్‌లోని విద్యార్ధులకు బ్రోకర్లు, సబ్ బ్రోకర్లు పేపర్లను అమ్ముకున్నట్లుగా నిందితుల విచారణలో తేలింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఏడుగురిని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అరెస్ట్ చేసిన వారిని కోర్టులో హాజరుపరుస్తామని అన్నారు.

 2 ప్రశ్నాపత్రాలు లీకయ్యాయి: 320 ప్రశ్నలను విద్యార్ధులకు ఇచ్చారన్న సీఐడీ

2 ప్రశ్నాపత్రాలు లీకయ్యాయి: 320 ప్రశ్నలను విద్యార్ధులకు ఇచ్చారన్న సీఐడీ

సీఐడీ ప్రాథమిక విచారణను మూడు అంశాలుగా విభజించి దర్యాప్తు చేస్తోంది. పేపర్ తయారీ-ప్రింటింగ్, కోచింగ్ సెంటర్లు-పరీక్షకు హాజరైన విధానం, సెల్‌ఫోన్ కాల్స్-ఎంసెట్ ర్యాంకులుగా విభజించి విచారణ చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ, సీఐడీ చీఫ్‌తో ఎంసెట్‌ కన్వీనర్‌ రమణారావు గురువారం భేటీ అయ్యారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Cid officials gave full clarification on eamcet 2 leakage.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి