అమ్మలాంటి సింగరేణిని కాపాడిన ఘనత సీఎందే.!కేసీఆర్ పై ప్రశంసలు కురిపించిన ఎమ్మెల్సీ కవిత.!

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సంబురాలు జరుపుకుంటున్న సింగరేణి బొగ్గు గని కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సింగరేణి కార్మికులకు ఇంక్రిమెంట్లతో పాటు, చిరకాల వాంఛ అయిన డిపెండెంట్ ఉద్యోగాలను సైతం సాధించుకున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. డిపెండెంట్ ఉద్యోగాలు రాకుండా అనేక వ్యక్తులు, శక్తులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, సీఎం చంద్రశేఖర్ రావు కార్మికుల మంచికోరే వ్యక్తిగా కారుణ్య నియామ ప్రక్రియ ద్వారా ప్రతినెలా ఉద్యోగులను తీసుకుంటున్నారన్న ఎమ్మెల్సీ కవిత, ఇప్పటిదాక దాదాపు 15 వేల వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు.

సింగరేణి సంస్థను కాపాడుతున్న గొప్ప నాయకులు కేసీఆర్..:వారసత్వ ఉద్యోగాలు కేవలం పురుషులకే కాకుండా, కూతుర్లు, కోడళ్లకు సైతం అవకాశం ఇవ్వడం ద్వారా మహిళల పట్ల సీఎం చంద్రశేఖర్ రావుకు ఉన్న గొప్ప మనసును తెలియజేస్తోందన్నారు ఎమ్మెల్సీ కవిత. కారుణ్య ఉద్యోగం వద్దనుకున్న వారికి గతంలో ఇస్తున్న రూ.10 లక్షలను, తెలంగాణ రాష్ట్రం వచ్చాక రూ.25 లక్షలకు పెంచామని ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు.

CM is credited with saving Singareni like mother! MLC Kavita praising KCR.

ఉద్యోగ విరమణ వయస్సును కూడా 61 సంవత్సరాలకు పెంచుకోవడం సంతోషకరమన్నారు. కార్మికులకు సౌకర్యవంతంగా పనిచేయాలనే ఉద్దేశ్యంతో సింగరేణి క్వార్టర్స్ కు ఉచిత విద్యుత్ తో పాటు, ఏసీ ఏర్పాటు చేసుకునే సౌకర్యాలు కల్పించడం, ఇంటికి పది లక్షల రూపాయల వరకు వడ్డీలేని రుణాన్ని ఇవ్వడం,ఉద్యోగ విరమణ తర్వాత కూడా వైద్య సదుపాయాలు అందించడం, సింగరేణి కార్మికుల పిల్లల ఐఐటీ, ఐఐఎం లాంటి చదువులకు ఫీ రీయింబర్స్ మెంట్ ఇవ్వడం జరుగుతుందన్నారు కవిత.

కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు..:సింగరేణి కార్మికుల కోసం మెడికల్ కాలేజీ లాంటి అనేక గొప్ప కార్యక్రమాలు తెలంగాణ వచ్చాక సాధించుకున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజుతో పాటు, మరో రోజున వేతనంతో కూడిన అధికారిక సెలవుగా ప్రకటించి సీఎం చంద్రశేఖర్ రావు అంబేద్కర్ పట్ల ఉన్న గొప్ప ప్రేమను మరోసారి చాటుకున్నారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

అమ్మ లాంటి సింగరేణి సంస్థను సీఎం కాపాడి, విస్తరించి, ఇతర రాష్ట్రాలకు సైతం సోలార్, థర్మల్ పవర్ ప్లాంట్ లను అధనంగా పెట్టి వేలాది మందికి ఉద్యోగాలు ఇవ్వడం, సంస్థను లాభాల బాట పట్టించడం తెలంగాణ రాష్ట్రం రావడం వల్లనే, తెలంగాణ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండటం వల్లనే సాధ్యమయ్యాయని గర్వంగా చెబుతున్నానన్నారు ఎమ్మెల్సీ కవిత.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+