ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల కోసం .. మరో సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్
తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు . ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. నేడు ప్రగతి భవన్లో కేసీఆర్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ .
Recommended Video

ఇప్పటికే తెలంగాణలో బలహీనవర్గాలకు 50 శాతం రిజర్వేషన్ అమలు లో ఉన్నాయని, సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం 10 శాతం రిజర్వేషన్ ల తో కలిపి మొత్తం 60 శాతం అవుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈ డబ్ల్యూ ఎస్) 10 శాతం రిజర్వేషన్ సౌకర్యం అమలు చేయాలని నిర్ణయం తీసుకోవటం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు . రెండు రోజుల్లోనే ఈ విషయంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి, తగిన ఆదేశాలను జారీ చేయనున్నట్లు గా కూడా సీఎం కేసీఆర్ వెల్లడించారు.

ప్రస్తుతమున్న రిజర్వేషన్ల తో పాటుగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య ఉద్యోగ అవకాశాల్లో పది శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్న ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఈ 10 శాతం రిజర్వేషన్లను కూడా అమలు చేయనున్నట్లుగా స్పష్టం చేశారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం నిజంగా శుభవార్త కానుంది.












Click it and Unblock the Notifications