ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే 105సీట్లు మనవే.. కానీ ఆ పని చెయ్యాలన్న సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణలో బీఆర్ఎస్ కు 105 సీట్లు వస్తాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈరోజు నిర్వహించిన బి ఆర్ ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు ఎన్నికల నేపధ్యంలో దిశానిర్దేశం చేశారు.

ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో భారత రాష్ట్ర సమితి శాసనసభాపక్ష సమావేశంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ వచ్చే ఎన్నికలను ఉద్దేశించి కీలక ఆదేశాలు ఇవ్వడంతోపాటు, తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై దిశానిర్దేశం చేశారు.

 kcr1-

ఈ ఏడాది ఎన్నికల ఏడాది కావడంతో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ శ్రేణులకు ఆయన పలు సూచనలు చేశారు. ఈ పదేళ్లలో ఏం చేశామో ప్రజలకు చెప్పాలని మనం చేసింది చెప్పుకుంటే చాలని కేసీఆర్ సూచించారు. తెలంగాణ రాక ముందు ఉన్న పరిస్థితులను, తెలంగాణ వచ్చిన తర్వాత మారిన పరిస్థితులను ప్రజలకు వివరించాలని కేసీఆర్ కోరారు.

70 ఏళ్ల కాంగ్రెస్ ప్రజలకు ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. మరో ఆరు మాసాల్లో ఎన్నికలు వస్తున్నాయి అని చెప్పిన కేసీఆర్, ప్రజా ప్రతినిధులు ప్రజల్లోనే ఉండాలని సూచించారు. అలసత్వం తగదని అందరూ ప్రజల మద్దతు కోసం పని చెయ్యాలన్నారు. ఎన్నికల షెడ్యూల్ తీసేస్తే ఐదు నెలలు మాత్రమే ఉంటుందని, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పూర్తిగా నియోజకవర్గాలకే పరిమితం కావాలని సీఎం కేసీఆర్ సూచించారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరుపుకుంటున్న దశాబ్ది ఉత్సవాలను ప్రజలతో కలిసి జరుపుకోవాలని కేసీఆర్ కోరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ చేసిన కృషిని ప్రజలకు చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది మనమే అని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరంగా అభివృద్ధి చేసింది కూడా మన ప్రభుత్వమేనని ప్రజలకు వివరించాలని కేసీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. మంత్రులు జిల్లాలలో జరిగే దశాబ్ది ఉత్సవాలను పర్యవేక్షించాలని అన్నారు సీఎం కేసీఆర్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+