కేసీఆర్ పై రేవంత్ బ్రహ్మాస్త్రం - టైం చూసి మరీ..!!

తెలంగాణ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. బీఆర్ఎస్ లో కవిత లేఖ తరువాత అనూహ్య పరి ణామాలు చోటు చేసుకుంటున్నాయి. అటు ఢిల్లీ కేంద్రంగా రేవంత్ పార్టీ పరంగా కీలక నిర్ణయాల పైన చర్చిస్తున్నారు. ఈ వారంలోనే మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యే అవకాశం ఉంది. బీఆర్ఎస్ అంతర్గత సమస్యలు ఎదుర్కొంటున్న వేళ రేవంత్ ఇదే సరైన సమయంగా భావిస్తున్న రేవంత్ బీఆర్ఎస్ పైన మరో అస్త్రం ప్రయోగించేందుకు సిద్దమయ్యారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న కీలక ప్రకటనకు సమాయత్తం అవుతున్నారు.

రేవంత్ కొత్త వ్యూహం
ముఖ్యమంత్రి రేవంత్ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు వాయిదా పడు తూ వస్తున్న మంత్రివర్గ విస్తరణకు అనుమతి దక్కింది. ఈ నెలాఖరులోగా మంత్రి వర్గ విస్తరణ పూర్తి కానుంది. ఆ వెంటనే పెండింగ్ లో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు వీలుగా సీఎం రేవంత్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ ఎన్నిక ల పైన ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ స్థానిక సంస్థల ఎన్నికల పైన రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ (పీఆర్‌) కమిషనర్‌ సృజన, ఇతర ఉన్నతాధి కారులతో సమీక్ష నిర్వహించారు. ఆ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసి ఉంచామని అధికారులు చెప్పినట్టు తెలుస్తోంది.

cm-revanth-begin-exercise-on-local-body-elections-may-announce-soon

సమరానికి సై
సీఎంతో భేటీ అనంతరం తొలిసారిగా కమిషనర్‌ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఇతర ముఖ్య అధికారులతో సమీక్ష చేసినట్లు సమాచారం. ఏ సమయంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడ వచ్చని, సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. రాజకీయంగానూ స్థానిక సంస్థల ఎన్నిక ల నిర్వహణకు ఇదే సరైన సమయంగా సీఎం రేవంత్ భావిస్తున్నారు. తాము అమలు చేస్తున్న పథకాలతో గ్రామాల్లో తమకు అనుకూల వాతావరణం ఉందని అంచనా వేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకత్వంలో నెలకున్న అంతర్గత సమస్యల కారణంగా కేడర్ కు దిశా నిర్దేశం కష్టంగా మారు తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. దీంతో, జూన్ లోనే ఎన్నికలను పూర్తి చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు ముగిసి ఏడాది దాటిపోయింది.

ఎన్నికలకు సిద్దం
కేంద్రం, 15వ ఫైనాన్స్‌ నిధులు రాక గ్రామాల్లో అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన నిలిచింది. ఇక, ఇప్పుడు ఎన్నికలకు వెళ్తే సన్నబియ్యం, రేషన్‌కార్డుల పంపిణీ, యువవికాసం వంటి పథకాల అమలు అంశం కలిసి వస్తుందని కూడా హస్తం నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆ పథకాలపై ఇంటింటా ప్రచారం చేయాలని ఎమ్మెల్యేలకు సీఎం, డిప్యూటీ సీఎం పలు సూచనలు ఇచ్చారు. దీంతో.. జూన్ 2న ప్రకటన.. ఆ తరువాత ఎన్నికల కార్యాచరణ మొదలు పెట్టే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అటు బీఆర్ఎస్ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాము సిద్దంగా ఉన్నామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+