పంచాయతీలు ఇచ్చిన జోష్.. మున్సిపల్ ఎన్నికలకు రేవంత్ సిద్ధం.. ఎప్పుడంటే!
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇటీవల పంచాయతీ ఎన్నికలలో విజయం సాధించిన జోష్ తో ఉన్న అధికార కాంగ్రెస్ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు పావులు కదుపుతోంది. ఫిబ్రవరి రెండో వారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలను పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దీనికోసం జనవరి మూడో వారం నాటికి అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని భావిస్తున్న ప్రభుత్వం, ఇప్పటికే ఎన్నికల కమిషన్ కు సంకేతాలు పంపింది.
మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 120 మునిసిపాలిటీలు, 9 కార్పొరేషన్ల గడువు ఈ ఏడాది జనవరి నెలలోనే ముగిసింది .ప్రస్తుతం ఆయా మున్సిపాలిటీలు ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నాయి మరోవైపు హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ల గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో ముగుస్తుంది. ఈ క్రమంలో గడువు తీరిన, గడువు తీరనున్న అన్ని స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ మున్సిపాలిటీలు, కార్పోరేషన్ లలో ఎన్నికలు
హైదరాబాద్ నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన సర్కార్, ఈ క్రమంలోనే ఓఆర్ఆర్ పరిధిలోని 27 మునిసిపాలిటీలను జిహెచ్ఎంసి లో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది..ఇక ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో జిహెచ్ఎంసి తో పాటు మొత్తం 8 మున్సిపల్ కార్పొరేషన్లు, 125 మునిసిపాలిటీలలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే గడువు ఉన్న కొన్నిచోట్ల ప్రస్తుతానికి మినహాయింపు ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
క్షేత్ర స్థాయిలో బలం నిరూపించుకునే ప్లాన్ లో కాంగ్రెస్
ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డుల విభజన రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ కూడా వేగవంతం కానుంది. పంచాయతీ ఎన్నికలలో ప్రజల తీర్పుతో, మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో కూడా విజయ కేతనాన్ని ఎగురవేయాలని, క్షేత్రస్థాయిలో తమ బలాన్ని నిరూపించుకోవాలని ఆలోచనలో కాంగ్రెస్ సర్కారు ఉంది.
అక్కడ భారీ నిధులు.. చకచకా పనులు
మరోవైపు ఎన్నికలను నిర్వహించాల్సిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం భారీగా నిధులను మంజూరు చేసి పనులను పరుగులు పెట్టిస్తోంది కాంగ్రెస్ సర్కార్. మున్సిపల్ పోరుకు సిద్ధమవుతున్న క్రమంలోనే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.
-
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
తెలంగాణలో ఆరోగ్య విప్లవం:పేదలకు కార్పొరేట్ వైద్యం-సీఎం రేవంత్ భారీ హెల్త్ ప్లాన్..!! -
భద్రాద్రి రాముడికి మహర్దశ: ఆలయ అభివృద్ధికి రూ.351 కోట్లు విడుదల! -
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications