కేసీఆర్ కు రేవంత్, జగన్ ఆసక్తికర ట్వీట్ - హరీష్ ఎమోషనల్..!!

మాజీ ముఖ్యమంత్రి...బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదినం నేడు. కేసీఆర్ కు సీఎం రేవంత్ తో సహా పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ మాజీ సీఎం జగన్ సైతం గ్రీటింగ్స్ చెప్పారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ ఇద్దరూ కేసీఆర్ తో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేసీఆర్ జన్మదిన వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. పూజలతో పాటుగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

రేవంత్ గ్రీటింగ్స్
కేసీఆర్ కు సీఎం రేవంత్ జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసారు." గజ్వేల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జన్మదినం సందర్భంగా వారికి హార్దిక శుభాకాంక్షలు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమ వుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదిం చాలి' అని ఆకాంక్షించారు. అదే విధంగా ఏపీ మాజీ సీఎం జగన్ సైతం కేసీఆర్ కు గ్రీటింగ్స్ చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

CM Revanth Reddy and YS Jagan BRS leaders extends birthday wishes to KCR

జగన్ - కేటీఆర్ ప్రత్యేకంగా
కేసీఆర్.. ప్రజా సేవలో నిండు నూరేళ్లు ఉండాలని జగన్ ఆకాంక్షిచారు. ఆ భగవంతుడు మీకు సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం ఇవ్వాలని అభిలషించారు. మీరు అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. కేసీఆర్ కు ఆయన తనయుడు కేటీఆర్ జన్మ దిన శుభాకాంక్షలు చెప్పారు. 'ప్రతి తండ్రీ తమ పిల్లల హీరో అని అంటారు. నా తండ్రి నా ఒక్కడికే కాదు.. తెలంగాణ హీరో కావడం నా అదృష్టం. కల కనడం.. దాని కోసం హద్దులేని నిబద్ధతతో బయ లుదేరారు. విమర్శకులను ఎదుర్కోవడం, అది ఎలా నెరవేరుతుందో వారికి గర్వంగా చూపించా రు. తెలంగాణ అనే కలను ప్రేమించారు. వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించకుండా తెలంగాణ సాధించారు. మీరు గర్వంగా మీ కొడుకని పిలుచుకునే వ్యక్తి కావడమే నా లక్ష్యం. మీ వారసత్వానికి అర్హులుగా ఉండటానికి ప్రతీక్షణం కృషి చేస్తా' అంటూ కేటీఆర్‌ ఎక్స్‌లో ఎమోషనల్‌ పోస్ట్‌ ట్వీట్‌ చేశారు.

హరీష్ ఎమోషనల్
కేసీఆర్ తో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ హరీష్ ఎమోషనల్ అయ్యారు. కేసీఆర్‌ అంటే తెలంగాణ ఉద్వేగం, ఉద్రేకం, తెలంగాణ స్వాభిమానం, జై తెలంగాణ యుద్ధ నినాదం, తెలంగా ణ సమున్నత అస్తిత్వం అన్నారు. మీరు నా తలనిమిరే తల్లిప్రేమ, నాకు ఎనలేని మమకారం పంచిన మేనమామ. నాకు రాజకీయ చైతన్యాన్ని నేర్పించి, నాలో ప్రజా సేవా సంస్కారాన్ని రంగరించి, నన్ను ఉద్యమ కార్యాచరణలో నడిపించి.. నాలోని నాయకత్వ గుణాన్ని ప్రేరేపించి, నాకు పరిపాలనా సామర్థ్యాన్ని కల్పించి, నన్ను చరితార్థుణ్ణి చేశారని తెలిపారు. మీరు శత వసంతాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అంటూ ఎక్స్‌ వేదికగా చేసిన పోస్టు వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+