Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నిరుద్యోగులకు ఎగిరి గంతేసే శుభవార్త!

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. త్వరలో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించి నిరుద్యోగులకు తీపి కబురు చెప్పారు. గత ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ప్రస్తుతం ఆశించిన మేర జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని, నిరుద్యోగుల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతుంది.

సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్న వేళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఉస్మానియా యూనివర్సిటీలో 80 కోట్ల రూపాయలతో నిర్మించిన హాస్టల్ భవనాలను ప్రారంభించిన సందర్భంగా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీలను గుర్తించి సుమారు 40 వేల పోస్టులను భర్తీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

CM Revanth Reddy said good news for the unemployed with 40000 job notifications soon

ఉద్యోగాల భర్తీ విషయంలో రేవంత్ చెప్పిందిదే
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 100 రోజులలోనే 55 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, అందులో 11 వేల టీచర్ పోస్టులు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇక ఇదే సమయంలో గత ప్రభుత్వ పాలన పైన విరుచుకుపడిన రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం విద్యార్థులను చదువు నుండి పక్కదారి పట్టించిందని ఆరోపించారు. గత పాలకులు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.

ఓయూ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న రేవంత్
ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకోవాలని తమ ఆశిస్తున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఆక్స్ఫర్డ్, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయాల మాదిరిగా ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఓయూ పోషించిన కీలక పాత్రను కొనియాడిన రేవంత్ రెడ్డి ప్రొఫెసర్ కోదండరామ్ జెఎసి పోరాటం, శ్రీకాంతాచారి , యాదయ్య బలిదానాలు తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేశాయని గుర్తుచేశారు.

ఓయూ అభివృద్ధి ప్రణాళిక రూపొందిస్తే అమలు చేస్తామన్న రేవంత్ రెడ్డి
ఎంతో చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీని సమున్నతంగా నిలపడానికి కృషి చేస్తామన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తే వెంటనే అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. మూడు వేల కోట్ల రూపాయలు ఓయూ అభివృద్ధికి ఇవ్వలేమా అని ప్రశ్నిస్తూ డిసెంబర్లో తిరిగి వస్తానని, ఉస్మానియా యూనివర్సిటీలో ఒక్క పోలీసు లేకుండా ఆదేశాలు ఇస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+