రాజకీయం అంటే ఇదే... ఆ పార్టీ కోరుకున్న అభ్యర్థినే ఎంపిక చేసిన సీఎం రేవంత్

రాజకీయం అంటేనే చాలా చిత్రంగా ఉంటుంది. అందులోనే అనేక రకాల అంశాలు మిళితమై ఉంటాయి. కానీ ఎవరికి నచ్చింది వారు చేసుకుంటూ దానికి రాజకీయం అనే పేరు తగిలిస్తారు. విలువలతో కూడిన నైతిక రాజకీయాలు, కుటిల వ్యూహాలు, కుతంత్రాలు, వెన్నుపోట్లు.. ఇలా రాజకీయాల్లో అనేక రకాలుంటాయి. అందుకే రాజకీయాన్ని పరిశీలిస్తుండాలికానీ అందులోని లోతుల్లోకి వెళ్లకూడదు. ఇదంతా ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థికి సంబంధించిన రాజకీయం ఎలా ఉంటుంది అనే విషయం తెలుసుకోవడానికి.

ముందుగానే సంకేతాలు పంపిన రేవంత్
నవీన్ యాదవ్ 2014 ఎన్నికల్లో మజ్లిస్ తరఫున జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. ఈ నియోజకవర్గంలో మైనార్టీల ఓట్లు 80వేలు ఉన్నాయి. అవన్నీ గుంపగుత్తగా మజ్లిస్ కే పడతాయనే విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న నవీన్ యాదవ్ కు నియోజకవర్గంలో పనిచేసుకోమని ఉప ఎన్నిక ఖరారైనప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకేతాలు పంపించారు. ఆయన పనిచేసుకుంటూ వస్తున్నారు. భారత రాష్ట్ర సమితి తరఫున దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత పోటీచేస్తున్నారు. సానుభూతి పవనాలు ఉంటాయని తెలిసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎన్నికల బరిలోకి దిగడానికే నిర్ణయించుకొని నలుగురు అభ్యర్థుల పేర్లను అధిష్టానానికి పంపింది. చివరకు నవీన్ యాదవ్ ఖరారయ్యారు.

CM Revanth reddy selected the candidate the Majlis wanted for Congress in the Jubilee Hills by-election

నవీన్ యాదవ్ అయితే ఓకే చెప్పిన మజ్లిస్
నవీన్ మాత్రమే పోటీచేయాలని మజ్లిస్ కాంగ్రెస్ ను కోరింది. పాతబస్తీలో తమ జోలికి రాకుండా ఉంటే ఇక్కడ మద్దతిస్తామని చెప్పింది. నవీన్ యాదవ్ కు జూబ్లీహిల్స్ లో ఉన్న మైనార్టీల ఓట్లన్నీ పడటంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఓట్లు పడతాయి. కమ్మ సామాజికవర్గం రేవంత్ రెడ్డిని బాగా ఇష్టపడుతుంది. ఎందుకంటే చంద్రబాబుకు నమ్మకమైన శిష్యుడు కావడంవల్ల. దీంతో ఆ వర్గానికి చెందిన ఓట్లు కూడా పడే అవకాశాలున్నాయి.

ఎందుకంటే ఈ సామాజికవర్గం మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేయలేదు. బీఆర్ఎస్ వైపే వివిధ కారణాలవల్ల మొగ్గుచూపారు. కానీ ఇప్పుడు కేంద్రంలో బీజేపీ, ఏపీలో టీడీపీ అధికారంలో ఉండటంతో కమ్మ సామాజికవర్గం ఓట్లు కాంగ్రెస్ కు పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో నవీన్ గెలుపు ఖాయమనే ధీమాలో కాంగ్రెస్ శ్రేణులున్నాయి. చివరకు ఎవరు విజయం సాధిస్తారనేది వచ్చే నెలలో తేలిపోనుంది. అప్పటివరకు వేచిచూద్దాం!.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+