కేంద్రానికి సీఎం రేవంత్ లేఖ, కీలక అంశాల ప్రస్తావన..!!
కేంద్రానికి సీఎం రేవంత్ లేఖ రాసారు. కీలక అంశాలను ప్రస్తావించారు. ఢిల్లీ వేదికగా జరిగిన భేటీ లో తీసుకున్న నిర్ణయాల అమలు పైన ప్రశ్నించారు. రెండు వారాలు పూర్తయినా సమాచారం ఏదీ లేకపోవటం పైన ప్రశ్నించారు. మొదటి దశ టేకోవర్ తో పాటుగా రెండో దశ ఆర్దిక వనరుల పైన చర్చలు చేస్తున్నారు. కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని రేవంత్ కోరారు.
మెట్రో పైన మరోసారి రేవంత్ స్పీడు పెంచారు. ఇప్పటికే ఢిల్లీలో వరుసగా రెండు రోజులు కేంద్ర మంత్రులతో ఇదే అంశం పైన చర్చలు జరిపారు. ఒక ప్రతిపాదనతో అంగీకారానికి వచ్చారు. కాగా, రెండు వారాలు అయినా కేంద్రం నుంచి స్పందన లేకపోవటంతో రేవంత్ మరోసారి కేంద్రానికి లేఖ రాసారు. అందులో కీలక అంశాలను ప్రస్తావించారు. ఢిల్లీలో మనోహర్‌లాల్ ఖట్టర్, అశ్వనీ వైష్ణవ్‌లతో సమావేశమై చర్చించిన అంశాలను వివరించారు. ఆ సమయంలోనే మొదటి దశ వ్యయాన్ని మళ్లీ మదింపు చేసేందుకు, రెండో దశ వ్యయ అంచనాలను నిర్ధారించేందుకు ఎస్‌బీఐ క్యాప్స్‌కు బాధ్యతలు అప్పగించారు. క్యాప్స్ బృందంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అధికారి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో అధికారిని ప్రతినిధులుగా చేర్చాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం తన ప్రతినిధిగా మెట్రోపాలిటన్ ప్రాంతం, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్‌ను ప్రకటించింది.

కేంద్రం స్పందించి నిర్ణయం తీసుకోవాలి
కాగా, కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు తన ప్రతినిధిని ప్రకటించలేదు. పైగా.. ఎస్‌బీఐ క్యాప్స్ కూడా బృందాన్ని ఏర్పాటు చేయలేదు. అయితే, మెట్రో తొలి దశ కోసం జపాన్ రుణం రూ 13,600 కోట్లు ఐఆర్పీఎఫ్ సీ వద్ద ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి తొలి దశ ప్రాజెక్టును అప్పగించేందు కు ఎల్ అండ్ టీతో రూ 15 వేల కోట్ల ఒప్పందం ఖరారైంది. ఇందులో రూ.13,600 కోట్లను రుణం రూపంలో తీసుకోవాలనుకున్న ప్రభుత్వం.. మిగతా రూ.1400 కోట్లను ఎల్‌అండ్‌టీకి చెల్లించింది. అయితే దీనిని తిరిగి మదింపు చేయాలన్న బాధ్యతలను ఎస్‌బీఐ క్యాప్స్‌కు అప్పగించినా.. ఇంకా ముందడుగు పడలేదు. ఇక.. ఇప్పుడు కేంద్రానికి రాసిన లేఖలో మెట్రో ఫేజ్-1 స్వాధీనం ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఎస్‌బీఐ క్యాపిటల్స్‌కు వెంటనే బాధ్యతలు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. జాప్యంతో మెట్రో ఫేజ్-2 వ్యయం పెరిగే ప్రమాదం అవకాశం ఉందని వెల్లడించారు. కేంద్రం జోక్యంతో ప్రక్రియ వేగవంతం చేయాలని కిషన్‌రెడ్డిని కోరారు.













Click it and Unblock the Notifications