CNN exit Polls: తెలంగాణలో ఎన్నికల అంచనాలన్నీ.. తారుమారు: అనూహ్యంగా
తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 62 శాతం వరకు పోలింగ్ నమోదైనట్లు సమాచారం. పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడుతున్నాయి. తెలంగాణతో పాటు అయిదు రాష్ట్రాలు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరంలల్లో వివిధ సంస్థలు నిర్వహించి ఎగ్జిట్ పోల్స్ వివరాలు అందుతున్నాయి.
తెలంగాణపై ఇదివరకు వెలువడిన అంచనాలన్నీ తారుమారు అయ్యే పరిస్థితులు కనిపిస్తోన్నాయి. సీఎన్ఎన్ (CNN exit Polls) నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ (Telangana Exit Polls)లో అంచనాలు ఎవరికీ అందని విధంగా ఉన్నాయి. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యా బలం.. 60.

తెలంగాణలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని సీఎన్ఎన్ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. ఏ పార్టీకి కూడా అధికారాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ రాదని తెలిపింది. భారత్ రాష్ట్ర సమితి- 48, కాంగ్రెస్- 56 స్థానాలను దక్కించుకుంటాయని అంచనా వేసింది. 119 సీట్లు ఉన్న తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 60 సీట్లు ఏ పార్టీకి కూడా అందవని తెలిపింది.
10 సీట్లతో బీజేపీ మూడో స్థానంలో నిలుస్తుంది. ఏఐఎంఐఎం అభ్యర్థులు అయిదు చోట్ల గెలుస్తారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో మజ్లిస్ అభ్యర్థులు కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది సీఎన్ఎన్ ఎగ్జిట్ పోల్స్‌ను బట్టి చూస్తే.












Click it and Unblock the Notifications