సొంతూరికి వెళ్ళాలా...వద్దా..సమగ్ర కుటుంబ సర్వేలో గందరగోళం..క్లారిటీ ఇదే!

తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే కొనసాగుతుం.ది నిన్నటి వరకు సమగ్ర కుటుంబ సర్వేలో ఇళ్ల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేసి ఇంటికి స్టిక్కర్లు వేసిన ఎన్యుమరేటర్లు నేటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే కి సంబంధించి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. అయితే సమగ్ర కుటుంబ సర్వే విషయంలో ప్రజలలో అనేక అనుమానాలు ఉన్నాయి. కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి.

సమగ్ర కుటుంబ సర్వేలో గందరగోళం
చాలామంది ఉపాధి నిమిత్తం తమ సొంత ఊర్లను, సొంత ఇంటిని వదిలి దూర ప్రాంతాలలో, పట్టణాలలో, నగరాలలో నివసిస్తున్నారు. అయితే వారు వారి వివరాలను సొంత ఊరికి వెళ్లి ఇవ్వాలా లేదా తాము ఉండే చోట ఇవ్వొచ్చా అన్నది చాలామందిని గందరగోళానికి గురి చేస్తున్న ప్రశ్న. అయితే దీనికి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

Confusion in the comprehensive family survey This is the clarity from govt where to record details

సొంతూరికి వెళ్ళాలా ... వద్దా.. క్లారిటీ ఇచ్చిన సర్కార్
ఎవరూ ఎటువంటి గందరగోళానికి గురికా వద్దని ఆధార్ కార్డులో చిరునామా తమ సొంత ఇంటి ప్రాంతంలో ఉన్నప్పటికీ ఆ కుటుంబం ప్రస్తుతం ఎక్కడ నివసిస్తుంటే అక్కడే గణకుల వద్ద తమ వివరాలను నమోదు చేయించుకోవచ్చు అని పేర్కొంది. సొంతింటికీ స్వగ్రామానికి వెళితేనే కుటుంబ వివరాలు నమోదు చేస్తారనేది అపోహ మాత్రమేనని ఎవరు ఈ విషయంలో ఆందోళన చెందవద్దని రాష్ట్ర ప్రణాళిక శాఖ సూచించింది.

సమాచారం ఇవ్వటానికి ఇవి సిద్ధం చేసుకోండి
ఇక ఈ సమగ్ర కుటుంబ సర్వేలో కుటుంబ సభ్యుల వ్యక్తిగత ఆధార్, సెల్ ఫోన్ నెంబర్లు ఇక ప్రశ్నాపత్రంలో అడిగిన వివరాలు అన్ని ఖచ్చితమైనవి తెలపాలని పేర్కొంది. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు పాస్ పుస్తకాలు, పట్టాదారు పాస్ పుస్తకాలు వంటివి అందుబాటులో ఉంచుకుంటే సర్వే కోసం వచ్చిన వారికి త్వరగా సమాచారం ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు .

ఫాం లోనూ పలు మార్పులు
ఇక ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వేలో కుటుంబ వివరాలు నమోదు కోసం ఇదివరకు ఖరారు చేసిన ఫామ్ లో కొన్ని మార్పులు చేర్పులు కూడా చేశారు. ఎవరైనా కులం వివరాలు చెప్పకపోతే 999 అని, ఏ సామాజిక వర్గం లేదు అంటే 01 కోడ్లతో నమోదు చేసేలాగా మార్పులు చేశారు.

ఈ వివరాలను నమోదు చేయనున్న గణకులు
ఇక అంతే కాదు ధరణిలో భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కొన్ని వరుసలను కూడా అదనంగా చేర్చారు. దేవాలయాలు, మసీదులు, చర్చి లకు ఎటువంటి వివక్ష, బెదిరింపులు లేకుండా స్వేచ్ఛగా వెళుతున్నారా లేదా అనే అంశాన్ని సైతం కొత్తగా యాడ్ చేశారు. మొత్తంగా సమగ్ర కుటుంబ సర్వే ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని ఒక కోటి 17 లక్షల 44,954 కుటుంబాల సమగ్ర వివరాలను నమోదు చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+