నిరుద్యోగులకు నోటిఫికేషన్ల తేదీలతో సహా ఉద్యోగాల హామీ: యువతను ఆకట్టుకునేలా కాంగ్రెస్ మేనిఫెస్టో!!

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులను ఫోకస్ చేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగులకు లబ్ధి చేకూరే అనేక విషయాలను ప్రస్తావించింది. నిరుద్యోగులకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ భారీగా గుడ్ న్యూస్ చెప్పింది. అభయ హస్తం పేరుతో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసిన క్రమంలో మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ నిరుద్యోగ యువతకు హామీ ఇచ్చింది.

అంతేకాదు గ్రూప్ 1, 2, 3, 4 ఉద్యోగాల నోటిఫికేషన్లకు సంబంధించిన తేదీలతో సహా ప్రకటించిన మేరకు ఉద్యోగాల భర్తీ చేస్తామని వెల్లడించింది. ప్రభుత్వ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.

Congress Good News for Unemployed: In Manifesto announced jobs Notifications dates!!

గ్రూప్ వన్ ఉద్యోగాల కోసం ఫిబ్రవరి 1 2024 న నోటిఫికేషన్ ఇస్తామని, గ్రూప్-2 ఉద్యోగాల కోసం ఏప్రిల్ ఒకటి 2024లో నోటిఫికేషన్ ఇస్తామని పేర్కొంది. గ్రూప్ 3 నోటిఫికేషన్ జూన్ 1, డిసెంబరు 1 రెండు విడతలుగా ఇస్తామని, గ్రూప్ 4 నోటిఫికేషన్ కూడా జూన్ 1న, డిసెంబర్ 1న రెండు విడతలుగా ఇస్తామని పేర్కొంది.

గ్రూప్స్ తో పాటుగా 13 విభాగాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానిస్టేబుల్ పరీక్షల నోటిఫికేషన్ తేదీలను కూడా ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి ఒకటవ తేదీన, డిసెంబర్ 15వ తేదీన కానిస్టేబుల్ పోస్టులతో పాటు ఇతర యూనిఫామ్ జాబ్స్ నోటిఫికేషన్లు ఇస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ప్రకటించింది.

అంతేకాదు నిరుద్యోగ యువత కోసం నిరుద్యోగ భృతి నాలుగు వేల రూపాయలు ఇస్తామని, నిరుద్యోగుల కోసం యూత్ కమీషన్ ద్వారా పది లక్షలు వడ్డీ లేని రుణాన్ని ఇస్తామని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఇక ఈ హామీలన్నీ ముఖ్యంగా నిరుద్యోగ యువతను తమ వైపుకు తిప్పుకునే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మేనిఫెస్టో లోని ఈ అంశాలకు యూత్ ఆకర్షితులు అవుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+