జూబ్లీహిల్స్ గెలిచినా.. రేవంత్ కు కొత్త టెన్షన్..!!
జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ భారీ విజయం నమోదు చేసింది. అంచనాలకు మించి మెజార్టీ దక్కించు కుంది. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం తమ ఖాతాలో వేసుకుంది. ఈ విజయం వెనుక సీఎం రేవంత్ పాత్ర కీలకం. అభ్యర్ధి ఖరారు నుంచి గెలుపు వరకు అన్నీ తానై వ్యవహరించారు. జూబ్లీహిల్స్ లో గెలిచి తీరాలని పార్టీ హైకమాండ్ రేవంత్ కు తేల్చి చెప్పింది. రేవంత్ సైతం మంత్రులకు అదే స్పష్టం చేసారు. ఇక.. ఇప్పుడు జూబ్లీహిల్స్ గెలిచినా రేవంత్ తో సహా ఆయన టీంకు కొత్త టెన్షన్ తప్పేలా లేదు.
జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ రికార్డు మెజార్టీతో విజయం సాధించింది. 24,711 ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుపొందారు. బీజేపీ డిపాజిట్ కోల్పోయింది. బీఆర్ఎస్ అభ్యర్ధి సునీతకు 74,259 ఓట్లు పోలయ్యాయి. అయితే.. ఈ గెలుపు వెనుక రేవంత్ వ్యూహాలు సక్సెస్ అయ్యాయి. అభ్యర్ధి ఖరారు నుంచి ఎంఐఎం సహకారం.. అజారుద్దీన్ కు మంత్రి పదవి.. ప్రచారంలోకి స్వయంగా దిగటం.. మంత్రులకు బాధ్యతలు..పోల్ మేనేజ్ మెంట్ పై దిశా నిర్దేశం ఈ విజయాన్ని అందించాయి.

కాగా, బీఆర్ఎస్ సైతం చివరి వరకు పోటీ ఇచ్చిన విషయాన్ని కాంగ్రెస్ విస్మరించలేని విషయం. 2023 ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ ఒక్క అసెంబ్లీ గెలవలేదు. ఈ రెండేళ్ల కాలంలో బీఆర్ఎస్ నుంచి గ్రేటర్ పరిధిలో రెండు సిట్టింగ్ స్థానాలు తమ ఖాతాలో వేసుకోగలిగింది. కంటోన్మెంట్, జూబ్లీ హిల్స్ స్థానాలు కాంగ్రెస్ దక్కించుకుంది.
కాగా, ఇప్పుడు సీఎం రేవంత్ కు బీఆర్ఎస్ బలం పైన ఒక స్పష్టత వచ్చింది. త్వరలో జరిగనున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటుగా గ్రేటర్ ఎన్నికలు రేవంత్ సమర్థతకు పరీక్షగా మారనున్నాయి. ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నిక కావటంతో మంత్రులను మొహరించి.. అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించి కాంగ్రెస్ విజయం సాధించిందనే వాదన ఉంది. అయితే, ఒకే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికలు జరిగితే అక్కడ ఈ స్థాయిలో మొహరింపు సాధ్యం కాదు.

అదే విధంగా గ్రేటర్ పరిధిలో మొత్తంగా ఒకే సారి ఎన్నిక జరిగినప్పుడూ.. ఈ తరహాలో ప్లాన్ అమలు సాధ్య పడేది కాదని పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే, రేవంత్ వచ్చే స్థానిక ఎన్నిక లు. .గ్రేటర్ లోనూ విజయం సాధిస్తేనే ఢిల్లీలో హైకమాండ్ వద్ద ఇమేజ్ పెరగనుంది. ప్రస్తుతం బీహార్ లో ఘోరమైన ఫలితాలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నాయకత్వానికి జూబ్లీహిల్స్ కొంత వరకు ఉపశమనం ఇవ్వనుంది. కానీ, వచ్చే ఎన్నికలు మాత్రం రేవంత్ సమర్థతకు పరీక్షగా మారటం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications