Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అసద్ పై కాంగ్రెస్ అభ్యర్దిగా సానియా మీర్జా - కలిసొచ్చేదెవరికి..!?

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు హోరా హోరీగా మారుతున్నాయి. మూడు ప్రధాన పార్టీల మధ్య పోరు ప్రతిష్ఠాత్మకంగా కనిపిస్తోంది. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్దులు ఖరారయ్యారు. బీజేపీ నుంచి హైదరాబాద్ అభ్యర్దిగా మాధవీలతను ఎంపిక చేసారు. ఈ సారి హైదరాబాద్ సీటు పైన బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ చేసి ఈ అభ్యర్దిని ప్రకటించింది. ఇదే సమయంలో కాంగ్రెస్ నుంచి అనూహ్యంగా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పేరు ఖరారైనట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ కొత్త లెక్కలు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. 14 సీట్ల లక్ష్యంతో సీఎం రేవంత్ అభ్యర్దుల ఎంపిక..ప్రచార బాధ్యతలు స్వీకరించారు. సీఎంతో పాటుగా పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌కు 17 స్థానాల్లోనూ పార్టీ గెలుపు కీలకంగా మారుతోంది. అందులో భాగంగా అభ్యర్దుల ఖరారు సమయంలో రేవంత్ ఛాయిస్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కు సంబంధించి హైకమాండ్ చర్చల్లో అనూహ్య పేరు ప్రతిపాదనకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా పేరు దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది.

Congress likely to field Sania Mirza for Hyderababad loksabha against MIM Leader Asad

హైదరాబాద్ బరిలో టెన్నిస్ స్టార్
హైదరాబాద్ కు చెందిన సానియా మీర్జా పేరు పైన పార్టీలో ఏకాభిప్రాయం వచ్చింది. టీమిండియా మాజీ కెప్టెన్, హైదరాబాద్ కు చెందిన కాంగ్రెస్ నేత అజాహరుద్దీన్ పేరు తొలుత పరిశీలనలోకి తీసుకున్నారు. అయితే, బీజేపీ నుంచి మహిళను బరిలోకి దించటంతో..కాంగ్రెస్ నుంచి సానియా పేరును ఆజహర్ ప్రతిపాదించినట్లు సమాచారం. దీంతో, వెంటనే కాంగ్రెస్ ముఖ్య నేతలు సానియా కుటుంబ సభ్యులతో టచ్ లోకి వెళ్లారు. తొలుత అంగీకరించకపోయినా..ఆ తరువాత ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. టెన్నిస్ స్టార్ గా పార్టీలకు అతీతంగా సానియా మీర్జాకు హైదరాబాద్ నగరంలో గుర్తింపు ఉంది. స్టార్ ప్లేయర్ గా క్రేజ్ సాధించారు.

Congress likely to field Sania Mirza for Hyderababad loksabha against MIM Leader Asad

కాంగ్రెస్ అభ్యర్దిగా సానియా మీర్జా
పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో విడిపోయిన తరువాత సోషల్ మీడియాలో సానియా మీర్జాకు మద్దతుగా నెటిజన్లు ముందుకు వచ్చారు. ఇక, హైదరాబాద్ తొలి నుంచి మజ్లిస్ పార్టీకి కంచుకోటగా ఉంది. ఈ సారి ఎలాగైనా అసద్‌ను ఓడించాలనేది బీజేపీ ప్లాన్ . అందుకోసం ఏరి కోరి మధవీలతను ఎంపిక చేసారు. మాధవీ లత ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అయితే, ఇప్పుడు సానియా మీర్జా పేరును కాంగ్రెస్ అధికారికంగా ప్రకటన చేస్తే హైదరాబాద్ ఎంపీ సీటులో ఎన్నికల పోరు మరింత ఆసక్తి కరంగా మారుతోంది. సానియాతో చర్చల తరువాతనే పేరు తెర మీదకు వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో, ఇప్పుడు టెన్నిస్‌లో అందరినీ ఆకట్టుకున్న సానియా..రాజకీయ రంగంలో ఎంట్రీ ఎలా ఉండబోతోందనేది ఆసక్తిని పెంచుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+