కాంగ్రెస్ నేత హత్యలో షాకింగ్ ట్విస్ట్: ప్రియుడితో కలిసి రెండో భార్యనే..

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నల్లగొండ జిల్లాలో కాంగ్రెసు నేత హత్య కేసులో విస్తుపోయే విషయం వెలుగు చూసింది. నల్లగొండ మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య నేపథ్యంలో ప్రత్యర్థులే ఈ హత్య కూడా చేసి ఉంటారనే అనుమానాలు కలిగాయి.

నల్గొండలో మరో దారుణ హత్య: ముక్కలు ముక్కలైన కాంగ్రెస్ నేత..

నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం నాగార్జున తండాలో బాంబు పేలి కాంగ్రెసు నేత దీపావత్ ధర్మా నాయక్ అనే కాంగ్రెసు నాయకుడు మరణించిన విషయం తెలిసిందే. నిద్రిస్తుండగా మంచం కింద బాంబు పెట్టి అతన్ని హత్య చేశారు.

అక్రమ సంబంధమే కారణం

అక్రమ సంబంధమే కారణం

ధర్మా నాయక్ (46) హత్యకు అక్రమ సంబధే కారణమనే విషయం వెలుగు చూసింది. అయితే ఈ హత్య వెనక అతని రెండో భార్య శిరీష, ఆమె ప్రియుడు రవి ఉన్నట్లు తేలింది. ధర్మా నాయక్ నిద్రిస్తున్న సమయంలో వారిద్దరు జిలిటెన్ స్టిక్స్‌కు నిప్పు పెట్టి అతనిపైకి విసిరారు.

  Boddupalli Srinivas case : సీఐ అదృశ్యం కేసులో ట్విస్ట్
  మొదటి భార్య చెల్లెలే

  మొదటి భార్య చెల్లెలే

  ధర్మా నాయక్ కొన్నేళ్ల క్రితం సావిత్రి అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. వారికి పిల్లలు పుట్టలేదు. దీంతో అతను సావిత్రి చెల్లె శిరీషను రెండో భార్యగా వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు.

  అతనితో లేచిపోయింది...

  అతనితో లేచిపోయింది...


  పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం - అదే గ్రామానికి చెందిన రవి అనే వ్యక్తితో శిరీష వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతనితో పాటు లేచిపోయింది కూడా. ఆ కారణంగానే ధర్మా నాయక్‌ను వారిద్దరు హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

  వారిద్దరు ఆ రాత్రి ఇలా చేశారు..

  వారిద్దరు ఆ రాత్రి ఇలా చేశారు..

  సోమవారం రాత్రి నాయక్ గాఢంగా నిద్ర పోయిన సమయంలో శిరీష, రవి క్వారీల్లో వాడే జిలిటెన్ స్టిక్స్‌కు నిప్పు పెట్టి వాటిని మంచం కింద పడేశారు. దాంతో అవి పేలి ధర్మా నాయక్ మరణించాడు. అతని దేహం ముక్కలు ముక్కలైంది. పోలీసులు హత్య కేసు నమోదు చేసి శిరీషను కస్టడీలోకి తీసుకున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  An illicit affair of the second wife of a 46-year-old man in Nalgonda district led to his murder in the wee hours of Tuesday.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి