టీపీసీసీ చీఫ్ ఖరారు - ఆ నలుగురికి మంత్రి పదవులు..!!

తెలంగాణ కాంగ్రెస్ కు నూతన సారధి ఖరారయ్యారు. అధికారిక ప్రకటన మిగిలి ఉంది. పీసీసీ ఖరారుపైన పార్టీ అధినాయకత్వం సీఎం రేవంత్ తో పాటుగా పార్టీ ముఖ్యులతో చర్చించింది. బీసీ వర్గానికే పీసీసీ పదవి ఇవ్వాలని నిర్ణయించింది. మంత్రివర్గ విస్తరణ పైన పార్టీ నాయకత్వంతో చర్చలు జరిగాయి. ఆరు పదవులు ఖాళీగా ఉండటంతో ప్రస్తుతం నలుగురితో మంత్రివర్గ విస్తరణకు పార్టీ నాయకత్వం ఆమోద ముద్ర వేసినట్లు సమాచారం.

టీపీసీసీ చీఫ్
తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడి ఎంపిక కొలిక్కి వచ్చింది. ఢిల్లీలో పార్టీ నాయకత్వం రాష్ట్ర నేతలతో వరుస చర్చలు చేసింది. సీఎం రేవంత్ తో పాటుగా భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీతో మధ్యాహ్నం చర్చలు జరిపారు. రాత్రి పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. పీసీసీ రేసులో బలరాం నాయక్‌, అడ్లూరి లక్ష్మణ్‌తో పాటు మహేశ్‌కుమార్‌గౌడ్‌, మధుయాష్కీ ఉన్నారు. వీరిలో మహేశ్‌కుమార్‌గౌడ్‌, మధుయాష్కీ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరి మధ్యే పోటీ నెలకొన్నది.

Congress party finalizes TPCC president awaiting official announcement

కసరత్తు
ఢిల్లీలో జరిగిన చర్చల్లో అధిష్ఠానంతోపాటు రాష్ట్ర మెజార్టీ నేతలు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ వైపే మొగ్గు చూపినట్టు తెలిసింది. ఈ మేరకు నేడో రేపో అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇక మంత్రివర్గ విస్తరణలో ప్రస్తుతం నలుగురికి అవకాశం ఇవ్వాలి నిర్ణయించారు. పి సుదర్శన్ రెడ్డి, కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, వాకిటి శ్రీహరి, మల్ రెడ్డి రంగారెడ్డి, బీర్ల అయిలయ్య పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరే ముందు వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇచ్చిన హామీల పైన నేతల మధ్య చర్చ జరిగింది.

నియామకాలు
రెండు పదవులు ఖాళీగా ఉంచి..నాలుగు పదవులు భర్తీ చేయాలని నిర్ణయించారు. విస్తరణలో భాగంగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఎస్సీ, బీసీ వర్గాలకు మంత్రివర్గంలో స్థానం ఖాయంగా కనిపిస్తోంది. ఓబీసీట్లో బలమైన వర్గంగా ఉన్న ముదిరాజ్ వర్గం నుంచి వాకాటి శ్రీహరికి మంత్రి పదవి ఖాయమని చెబుతున్నారు. బీసీల నుంచి యాదవ వర్గానికి, ఎస్టీల్లో లంబాడాల్లో ఒకరికి, ఎస్సీల నుంచి మరో నేతకు ఛాన్స్ దక్కనుంది. ఈ నెలాఖరులోగానే మంత్రి వర్గ విస్తరణ ఖాయంగా కనిపిస్తోంది. దీంతో, ఆశావాహుల్లో ఉత్కంఠ పెరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+