హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మెల్యే జగ్గారెడ్డికి షాక్ : వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తొలగింపు ; అద‌న‌పు బాధ్య‌త‌లు ఎవ‌రికంటే..!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ కాంగ్రెస్ సీనియన్ నేతల ప్రత్యేక భేటీ వ్యవహరంపై అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. సమావేశం నిర్వహించవద్దని ఆదేశించినా.. భేటీ కావడంతో హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీలో సమస్యలు ఉంటే నేరుగా వచ్చి చెప్పాలని కోరింది. కానీ కాంగ్రెస్ సీనియర్ నేతలు వీహెచ్, మర్రి శశధర్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కమలాకర్ రావు, ఇతరల నేతలు ఓ హోటల్‌లో సమావేశమైయ్యారు. భేటీ అనంతరం ఎమ్మెల్యే జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శించారు. సవాళ్లు విసిరారు. పార్టీ బాగు కోసం గతంలో సమావేశమైయ్యాం.. మళ్లీ, మళ్లీ భేటీ అవుతుంటాం.. దాంట్లో తప్పేంటంటూ మాజీ మంత్రి శశిధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

వ‌ర్కెంట్ ప్రెసిడెంట్ అద‌న‌పు బాధ్య‌త‌లు తొల‌గింపు

వ‌ర్కెంట్ ప్రెసిడెంట్ అద‌న‌పు బాధ్య‌త‌లు తొల‌గింపు

ఈ పరిణామలపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయ్యింది. కీలక నిర్ణయం తీసుకుంటూ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి షాక్ ఇచ్చింది. హైకమాండ్ నిర్ణయం మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆయనకు ఇచ్చిన అదనపు బాధ్యతల నుంచి తొలగిస్తూ టీపీసీసీ నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు నియోజకవర్గాల బాధ్యతలు, అనుబంధ సంఘాల బాధ్యతలను నుంచి జగ్గారెడ్డిని తప్పించింది. జగ్గారెడ్డికి ఉన్న బాధ్యతలను మిగతా వర్కింగ్ ప్రెసిడెంట్లకు అప్పగిస్తూ టీపీసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, మహేష్ గౌడ్ లకు రేవంత్ రెడ్డి ఈ బాధ్యతలను అప్పగించారు.

 హైక‌మాండ్ ఆదేశాలు దిక్క‌ర‌ణ‌

హైక‌మాండ్ ఆదేశాలు దిక్క‌ర‌ణ‌


తొలి నుంచి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీలోని కొందరు సీనియర్ నేతలు ఆదివారం ఓ హోటల్‌లో ప్రత్యేకంగా సమావేశమైయ్యారు. వీరి భేటీపై అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి.. దీంతో ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు సీనియర్లకు ఫోన్ చేసిన సమావేశం వద్దని సూచించారు. ఇలాంటి ప్రత్యేక భేటీపై ప్రత్యర్థి పార్టీలు తప్పుప్రచారం చేస్తాయి.. కార్యకర్తల్లో కూడా తప్పుడు భావన వెళ్తోందని చెప్పారు. అయినా వీన‌కుండా సీనియర్లు సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో అధిస్టానం సీరియస్ అయ్యింది. చర్య‌లు తీసుకునేందుకు సిద్ధమైంది. మరో రెండు రోజుల్లో క్రమశిక్షణ కమిటీ సమావేశం అయ్యే అవకాశం ఉందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తెలిపారు..

 రేవంత్ రెడ్డికి జ‌గ్గారెడ్డి స‌వాల్

రేవంత్ రెడ్డికి జ‌గ్గారెడ్డి స‌వాల్


కాంగ్రెస్ సీనియర్ నేతల సమావేశం అనంతరం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే జగ్గారెడ్డి విరుచుకుపడ్డారు. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా... దమ్ముంటే నాపై కాంగ్రెస్ పార్టీ తరుపున అభ్యర్థి పోటీ పెట్టి గెలిపించాలంటూ సవాల్ విసిరారు. గెలిస్తే నువ్వు హీరో.. ఓడితే నేను జీరో అంటూ విమర్శించారు. తనను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసే దమ్ము ఎవరికీ లేదన్నారు. షోకాజ్ నోటీసులు ఇస్తే .. ఒక్కో బండారం బయటపెతానంటూ రేవంత్ పై మండిపడ్డారు . ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే జగ్గారెడ్డికి హైకమాండ్ షాక్ ఇచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

English summary
congess high command serious on MLA Jagga reddy and remove from working president activities
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X