'టిఆర్ఎస్ దోపిడిపై సిబిఐ, ఈడీని ఆశ్రయిస్తాం'

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్:తెలంగాణ జెఎసి చైర్మెన్ కోదండరామ్ రాజకీయ పార్టీనా తమకు నష్టం లేదని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క చెప్పారు.

జెఎసి చైర్మెన్ కోదండరామ్ ను రాజకీయనాయకుడిగా తాము చూడడం లేదని ఆయన చెప్పారు. మంగళవారం నాడు ఆయన అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు.

కోదండరామ్ పార్టీ పెట్టడం ఆయనిష్టమన్నారు. ఆయన పార్టీ పెడితే కాంగ్రెస్ కు నష్టమే లేదని భట్టి అభిప్రాయపడ్డారు.కాంగ్రెస్ పార్టీలో తన గొంతు నొక్కుతున్నారనే ప్రచారాన్ని ఆయన ఖండించారు. కాంగ్రెస్ పార్టీలో తన పాత్రను పోషిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.

congress party will move to cbi and ed on trs misappropriation

తన పాత్ర తాను పోషించకుండా కాంగ్రెస్ పార్టీలో ఎవరూ ఆపలేరని ఆయన అభిప్రాయపడ్డారు. టిఆర్ఎస్ దోపిడిపై ఈడీ, సిబిఐ కోర్టులను ఆశ్రయిస్తామని ఆయన చెప్పారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటర్లు తీర్పును ఇచ్చారని చెప్పారు.అయితే రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కూడ టిఆర్ఎస్ కు ఓటమి తప్పదని ఆయన జోస్యం చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తోందని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వాలని ప్రజలు భావిస్తున్నారని ఆయన చెప్పారు.

కెసిఆర్ పాలనపై ప్రజలకు భ్రమలు తొలగుతున్నాయని భట్టి అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ లో సింగిల్ లీడర్ షిప్ ఉండదన్నారు. ఏక నాయకత్వంలో విజయం సాధిస్తామన్న భావన తప్పు అని ఆయన అభిప్రాయపడ్డారు.కెసిఆర్ ప్రజాకర్షక హమీతో టిఆర్ఎస్ ను గెలిపించాయని విక్రమార్క అభిప్రాయపడ్డారు. తెలంగాణలో సిఎం అభ్యర్థిని ముందే ప్రకటించే అవకాశం ఉందన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
congress party will move to cbi and ed on trs misappropriation said mallu batti vikra marka in assembly lobbies on tuesday.
Please Wait while comments are loading...