అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక కుట్ర..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయన నటించిన పుష్ప-2 సినిమా ప్రీమియర్ షోస్ రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ దగ్గరకు వెళ్లడంతో అక్కడ భారీ జనసందోహం ఏర్పడింది. ఈక్రమంలో ఓ మహిళ మరణించారు. ఓ బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయంలో అల్లు అర్జున్‌తో పాటు, సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. తాజాగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా, ఈ కేసులో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి భారీ భద్రత నడుమ స్టేషన్‌కు తరలిస్తున్నారు.

అల్లు అర్జున్‌పై ఎఫైర్ నమోదు చేసిన పోలీసులు ఆయన్ను చికడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.ముందుస్తు నోటీసులు ఇచ్చిన తర్వాతే ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.అయితే గతంలో ఇలాంటి ఘటనలు చాలానే జరిగినప్పటికీ, వారిపై ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. పెద్ద హీరోల ప్రీ-రిలీజ్ ఈవెంట్స్ జరిగిన సమయంలో అభిమానులు మరణించిన ఘటనలు చాలానే చూశాం. కానీ ఒక్క అల్లు అర్జున్‌పైనే కేసు నమోదు కావడం, ఆయన్ను అరెస్ట్‌ చేయడం వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా అనే అనుమానం అల్లు అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

Conspiracy behind Allu Arjun arrested

ఇటీవల జరిగిన ఎన్నికల్లో అల్లు అర్జున్ ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కల్యాణ్‌కు మద్దతుగా నిలిస్తే, అల్లు అర్జున్ మాత్రం తన మిత్రుడు అయిన వైసీపీ అభ్యర్థి శిల్పా రవికుమార్ రెడ్డికి మద్దతుగా నిలుస్తూ నంద్యాల వెళ్లారు. ఇక పుష్ప-2 విడుదల సమయంలో కూడా ఎక్కడా కూడా మెగా ఫ్యామిలీ హీరోల గురించి అల్లు అర్జున్ ప్రస్తావించలేదు. దీంతో మెగా అభిమానులంతా కూడా పుష్ప-2కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఇక సినిమా విడుదల తర్వాత సక్సెస్ మీట్‌లో టికెట్ల రేట్లనందుకు తెలంగాణ సీఎంకు కృత‌జ్క్ష‌త‌లు చెప్పే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పేరును అల్లు అర్జున్ మార్చిపోయారు.

దీనిపై కూడా అల్లు అర్జున్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్ కావడం సంచలనం మారింది. అసలు ఈ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అవుతారని ఎవరూ ఊహించలేదు. ప్రస్తుతం ఆయన్ను కోర్టుకు తరలించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.ఈ ఘటనతో చట్టం ముందు ఎవరైన సమానమే అని తెలంగాణ పోలీసులు నిరూపించినట్టు అయింది. సెలబ్రిటీ అయినప్పటికీ అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం ద్వారా తమకు అందరూ సమానమే అని తెలంగాణ పోలీసులు చాటి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+