కానిస్టేబుళ్లను,హోంగార్డులను కూలీలుగా మార్చారు..! మన పోలీసు పెద్దలు మారరు బాసూ..!!
Recommended Video

హైదరాబాద్ : రోజులు మారుతున్నాయి.. జనరేషన్లు మారుతున్నాయి.. వ్యక్తుల ఆలోచనా విధానంలో మార్పులు వస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు సైతం కార్పోరేట్ సంస్క్రుతిని చాటుకుంటున్నాయి. మొత్తానికి సమాజం ప్రపంచీకరణ, ఆధునీకరణవైపు అడుగులు వేస్తోంది. ఇలాంటి రోజుల్లో పోలీసు వ్యవస్థలో మాత్రం ఎలాంటి మార్పులు సంతరించుకోక పోవడం శోచనీయం. ఏళ్లతరబడి పై అదికారులు క్రింది స్థాయి అదికారులపై పెత్తనం చెలాయించడం, ప్రయివేటు పనులతో పాటు, ఇంటి పనులు చేయించడం ఆనావాయితీగా వస్తోంది. హైదరాబాద్ మహానగరం విశ్వనగరం దిశగా పరుగులు తీస్తున్న తరుణంలో కూడా వ్యవస్థలో పేరుకుపోయిన బాసిసమ్ లో మాత్రం ఎలాంటి మార్పు రావకపోవడం విచారించదగ్గ విషయం. ఇక ఎక్కడో మారుమూల గ్రామాల్లో పోలీసు ఉన్నాతాదికారులు క్రింది స్థాయి అదికారులతో ఏవో ప్రయివేట్ పనులు చేయించారంటే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు.

కాని స్వయానా హైదరాబాద్ పరిదిలోని పోలీస్ కమీషనరేట్లలో క్రింది స్థాయి సిబ్బంది చేత చేయకూడని పనులు చేయించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక ఇదే రాచకొండ కమిషనరేట్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. పోలీసు బాస్‌లు కానిస్టేబుళ్లను, హోంగార్డులను కూలీలుగా మార్చారు. వాళ్లతో వెట్టిపని చేయిస్తున్నారు. సరూర్‌నగర్ మహిళా పీఎస్, ఎస్‌వోటీ ప్రాంగణాల చుట్టూ గోడ కట్టే పనిని పోలీసులు ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించారు. ఆ కాంట్రాక్టర్ కనుమరుగు కావడంతో ఉన్నతాధికారులు పోలీసులతో ఆ పనులు చేయిస్తున్నారు. కూలీ నాలి చేసుకునే దౌర్బాగ్యం నుండి బయటపడేందుకు కాస్త ఉన్నత చదువులు చదువుకుని సర్కార్ కొలువు చేద్దామని కఫ్టపడి ఉద్యోగం సంపాదించిచుకున్న వారికి పై అదికారులు మళ్లీ వారిని దినసరి కూలీలుగానే మార్చారవని సదరు పోలీసులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న జీతం తీసుకుని కొలువు చేద్దాం అనుకున్న పోలీసులకు ఉత్నతాదికారుల చర్యలు శరాఘాతంలా పరిణమించాయి. ఉన్నతాదికారుల ఆజ్ఞనలను కాదంటే ఎక్కడ ఉద్యోగం పోతుందోనని కానిస్ఠేబుల్ స్థాయి ఉద్యోగులు కిక్కురుమనకుండా వారు చెప్పిన పనులు చేస్తుకెళ్తున్నట్టు తెలుస్తోంది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications