టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా ? హోమ్ క్వారంటైన్ అందుకేనా ?

ఇప్పుడు కరోనా సామాన్య ప్రజలనే కాక ప్రజా ప్రతినిధులను భయపెడుతుంది . ఎప్పుడు ఎవరికి ఎలా కరోనా వ్యాప్తి చెందుతుందో తెలీని పరిస్థితి నెలకొంది. ఇక తాజాగా తెలంగాణా రాష్ట్రంలోని అధికార పార్టీ ఎమ్మెల్యేకి కూడా కరోనా సోకినట్టుగా తెలుస్తుంది. దీంతో ప్రస్తుతం ఆయన సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నారని సమాచారం .

సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు కరోనా ?

సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు కరోనా ?

తెలంగాణా రాష్ట్ర సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఇటీవల అమెరికా వెళ్ళి 40 రోజులు అక్కడ వుండి వచ్చారు. ఇక ఆయన అక్కడ నుండి రాగానే ఎయిర్‌పోర్టులో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎలాంటి సందేహం లేదని ఇంటికి పంపించారు. కానీ తాజాగా ఆయన్ను ఇంటికే పరిమితమవమని చెబుతూ హోం క్వారెంటైన్ చేశారు. దీంతో ఆయనకు కరోనా సోకిందన్న చర్చ జరుగుతుంది . ఇపుడు అధికార పార్టీ నాయకులకు ఆయనను కలిసిన వారికి పెద్ద టెన్షన్ పట్టుకుంది.

 ఇటీవల అమెరికా వెళ్లి వచ్చిన కోనేరు కోనప్ప

ఇటీవల అమెరికా వెళ్లి వచ్చిన కోనేరు కోనప్ప

గతంలో కాంగ్రెస్ తరపున గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేరారు కోనేరు కోనప్ప . 2018లో టీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఈ మధ్య కుటుంబంతో అమెరికా వెళ్ళారు. అయితే అక్కడ కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపించిన విషయం తెలిసిందే . ఇక కోనేరు కోనప్ప 40 రోజులు అక్కడ వుండి తిరిగి వచ్చారు. వచ్చాక ఆయన సహజంగానే పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. నియోజక వర్గ ప్రజలతో, అనుయాయులతో కలిశారు .

హోం క్వారెంటైన్ కావాలని చెప్పిన అధికారులు

హోం క్వారెంటైన్ కావాలని చెప్పిన అధికారులు


ఇంత వరకు బాగానే వున్నా జిల్లా వైద్య అధికారులు వచ్చి ఆయన్ను 12 రోజుల పాటు హోం క్వారెంటైన్ కావాలని చెప్పటం కొంపదీసి ఆయనకు కరోనా ఉందా అన్న అనుమానానికి కారణం అవుతుంది. ఇక వైద్య శాఖాధికారులు చెప్పిన విషయానికి కోనప్ప మొదటి కంగారు పడినప్పటికీ ఆ తర్వాత ముఖ్యమంత్రి, మంత్రుల సూచన మేరకు హోం క్వారెంటైన్‌ అవ్వడానికి రెడీ అయ్యారు.

సెల్ఫ్‌గానే హోం క్వారెంటైన్ అయ్యానన్న కోనేరు కోనప్ప

సెల్ఫ్‌గానే హోం క్వారెంటైన్ అయ్యానన్న కోనేరు కోనప్ప

తనకు ఎవరు ఆదేశాలివ్వలేదని వైద్య బృందం సలహా, సీఎం సూచన మేరకు సెల్ఫ్‌గానే హోం క్వారెంటైన్ అయ్యానని కోనేరు కోనప్ప చెప్తున్నారు . తాను సంపూర్ణ ఆరోగ్యంతో వున్నానని అంటున్నారు. తనకు కరోనా సోకిందన్న వదంతులను నమ్మొద్దని ఆయన తన నియోజకవర్గ ప్రజలను, అనుయాయులను కోరుతున్నారు. ఇక ఒక్క కోనేరు కోనప్ప మాత్రమే కాదు చాలా మంది ప్రజా ప్రతినిధులు బయటకు వెళ్ళాలంటే కార్యక్రమాల్లో పాల్గోవాలంటే భయపడుతున్న పరిస్థితి ఉంది .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+