చిలుకానగర్ నరబలి: విస్తుపోయే ఆధారం, సంభాషణల ఆడియో క్లిప్
హైదరాబాద్: హైదరాబాదు ఉప్పల్ ప్రాంతంలోని చిలుకానగర్‌లో చిన్నారిని బలి ఇచ్చిన కేసులో పోలీసులకు మరో ఆధారం దొరికింది. పోలీసులకు ఆడియో క్లిప్ లభించింది. దాన్ని వారు స్వాధీనం చేసుకున్నారు.
Recommended Video

చిలుకానగర్‌లో రాజశేఖర్ అనే క్యాబ్ డ్రైవర్ ఇంటిపై చిన్నారి తల లభించిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు మరింత ప్రగతిని సాధించారు. రాజశేఖర్ మొబైల్‌లో రికార్డయిన ఆడియో క్లిప్ పోలీసుల చేతికి చిక్కింది.

దంపతుల ఆడియో సంభాషణలు
రాజశేఖర్ మొబైల్‌లో అతనికి, అతని భార్య శ్రీలతకు మధ్య జరిగిన సంభాషణ రికార్డయి ఉంది. అది కేసులో కీలకంగా మారే అవకాశం ఉంది. శ్రీలతను దుష్టశక్తి ఆవహించిందనే ఉద్దేశంతో ఆ దుష్టశక్తితో రాజశేఖర్ మాట్లాడుతున్నట్లు భార్యతో మాట్లాడిన మాటలు రికార్డయ్యాయి.

కష్టాలకు కారణాలు అడిగాడు...
తన భార్యను ఆవహించిన దుష్టశక్తిని తన కుటుంబానికి వచ్చిన కష్టాలేమిటో రాజశేఖర్ అడిగి తెలుసుకునే మాటలు అందులో ఉన్నాయి దానికి పరిష్కారమేమిటో కూడా అడిగాడు. నీకు ఏ విధమైన బలి కావాలి, జంతు బలి కావాలా, నరబలి కావాలా అని రాజశేఖర్ అడిగిన ప్రశ్నలు అందులో రికార్డయ్యాయి.

అతనే ఇలా చేశాడు
తన ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తి చిన్నారి తలను పడేశారని పోలీసులకు చెప్పి రాజశేఖర్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే, రాజశేఖర్ చిన్నారిని బలి ఇచ్చి, మొండాన్ని మూసీనదిలో పడేసి, తలతో క్షుద్రపూజలు చేశాడని పోలీసులు తేల్చారు. తద్వారా తన భార్య ఆరోగ్యం బాగుపడుతుందని అతని నమ్మాడు. చిన్నారి తలతో నగ్నంగా భార్యాభర్తలు చంద్రగ్రహణం రోజు పూజలు చేశారని పోలీసులు నిర్దారించుకన్నారు.

ఫోరెన్సిక్ పరీక్షల్లో ఇలా తేలింది..
రాజశేఖర్‌ను అరెస్టు చేసిన తర్వాత పోలీసులు అతని మొబైల్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపించారు. పోలీసులకు మరో ఆడియో కూడా లభించింది. నరబలి గురించి రాజశేఖర్ తన మిత్రులను సంప్రదించిన మాటలు అందులో రికార్డయి ఉన్నాయి.

అది 34 నిమిషాల వీడియో..
ఆ ఆడియోను రాజశేఖర్ నిరుడు నవంబర్ 17వ తేదీన తన ఇంట్లో తీసిన ఆడియో 34 నిమిషాల నిడివితో ఉందని స్టేషన్ హౌస్ ఆఫీసర్ పి. వెంకటేశ్వర్లు తమతో చెప్పినట్లు దక్కన్ క్రానికల్ రాసింది. తన భార్యకు, రాజశేఖర్‌కు మధ్య జరిగిన సంభాషణలు అందులో ఉన్నాయి.

భార్యను మరో స్త్రీ ఆవహించిందని...
తన భార్య శ్రీలతను మరో స్థ్రీ ఆవహించిందని రాజశేఖర్ విశ్వసించాడు. అతను తన భార్యను ఆవహించిన పరాయి స్త్రీతో మాట్లాడిన మాటలుగా రికార్డయ్యాయి. తమకు ఆర్థిక, ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయని, తన భార్యను ఎందుకు వేధిస్తున్నావని రాజశేఖర్ పరాయి స్త్రీని అడిగాడు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications