Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణలో 6551 కరోనా కేసులు: జీహెచ్ఎంసీలో అత్యధికం, 43 మంది మరణం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో (ఆదివారం రాత్రి 8 గంటల వరకు) 73,275 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 6551 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఆదివారం 43 మంది మరణించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది.

Recommended Video

    Covid 19 Second Wave Impact On Hyderabad Metro Rail | Oneindia Telugu

    కరోనా బారి నుంచి నిన్న 3804 మంది కరోనా నుంచి సురక్షితంగా బయటపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 65,597కి చేరింది. కాగా, జీహెచ్ఎంసీ పరిధిలో 1418 కేసులు నమోదయ్యాయి.

    తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,01,783కు చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2042 మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు.

    Covid-19: 6551 new cases and 43 fatalities in Telangana

    జీహెచ్ఎంసీ తర్వాత అత్యధికంగా మేడ్చల్ మల్కాజ్ గిరిలో 554, రంగారెడ్డిలో 482, నిజామాబాద్‌లో 388, సంగారెడ్డిలో 368, వరంగల్ అర్బన్ లో 329, జగిత్యాలలో 276, కరీంనగర్‌లో 222, మహబూబ్ నగర్‌లో 226, సిద్దిపేటలో 268 కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ వెల్లడించింది.

    ఇది ఇలా ఉండగా, తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కరోనా మొదటి వేవ్‌తో పోలిస్తే సెకండ్ వేవ్ పూర్తి భిన్నంగా ఉందన్నారు. ఇంట్లో ఒక్కరికి వైరస్ సోకితే మిగా వారందరికీ వేగంగా వ్యాపిస్తోందన్నారు. అందుకే ఇంట్లో ఉండే అవకాశం లేని వారందరి కోసం ప్రభుత్వ ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వైరస్ కారణంగా ప్రాణాలు పోకుండా చూడటమే మనందరి లక్ష్యమని మంత్రి చెప్పారు. కరోనా వచ్చి హోం ఐసోలేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఆశా వర్కర్లు రోజుకు రెండు సార్లు ఆక్సిజన్ లెవల్స్, జ్వరం పరీక్ష చేయాలని ఆదేశించారు. ఈ విధంగా చేసినప్పుడే ప్రాణాలు పోకుండా కాపాడగలుగుతామని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+