షాకింగ్: నడిరోడ్డుపై వృద్ధులపై రెచ్చిన అంబటి రాయుడు, చేయి చేసుకున్నాడు

క్రికెటర్ అంబటి రాయుడు రౌడీయిజం ప్రదర్శించారంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఓ సీనియర్ సిటిజన్ పైన ఆయన చేయి చేసుకున్నాడని తెలుస్తోంది. దీనిపై అంబటి రాయుడుపై విమర్శలు వెల్లువెత్తాయి.

Recommended Video

    Cricketer Ambati Rayudu misbehaves And manhandles old person : Video Viral

    హైదరాబాద్: క్రికెటర్ అంబటి రాయుడు రౌడీయిజం ప్రదర్శించారంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఓ సీనియర్ సిటిజన్ పైన ఆయన చేయి చేసుకున్నాడని తెలుస్తోంది. దీనిపై అంబటి రాయుడుపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, రాయుడు, సదరు సీనియర్ సిటిజన్ ఇద్దరు కూడా పరస్పరం తిట్టుకున్నారు.

    రాష్ డ్రైవింగ్

    అంబటి రాయుడు హబ్సిగూడ జెన్ పాక్ కాలనీలో ఉంటున్నారు. ఈ ప్రాంతంలో సీనియర్ సిటిజన్లు మార్నింగ్ వాక్ చేస్తుంటారు. గురువారం సీనియర్ సిటిజన్లు మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో అంబటి రాయుడు కారును వేగంగా నడుపుతూ వచ్చారు.

    సీనియర్ సిటిజన్‌కు తగిలిన కారు

    సీనియర్ సిటిజన్‌కు తగిలిన కారు

    ఆ సమయంలో కారు ఓ సీనియర్ సిటిజన్‌కు తగిలింది. అప్పుడు అక్కడ ఉన్న మిగతా సీనియర్ సిటిజన్లు... అంబటి రాయుడును ప్రశ్నించారు. ఇలా వేగంగా వెళ్తే ఎలాగని, వేగంగా వెళ్తుండటం వల్ల ఒకరికి గాయాలయ్యాయని నిలదీశారు.

    ఊగిపోయిన అంబటి రాయుడు

    ఊగిపోయిన అంబటి రాయుడు

    సీనియర్ సిటిజన్లు ప్రశ్నించడంతో అంబటి రాయుడు ఆగ్రహంతో ఊగిపోయాడని తెలుస్తోంది. మీ ఇష్టం వచ్చిన వారికి చెప్పుకోవాలని వారిని బెదిరించాడని తెలుస్తోంది. అంతేకాదు, వారిపై చేయి కూడా చేసుకున్నాడని వార్తలు వచ్చాయి.

    రాయుడు తీరుతో స్థానికుల ఆశ్చర్యం

    రాయుడు తీరుతో స్థానికుల ఆశ్చర్యం

    అంబటి రాయుడు ప్రవర్తనపై స్థానికులు ఆశ్చర్యపోయారని చెబుతున్నారు. నడిరోడ్డుపై సీనియర్ సిటిజన్లపై చేయి చేసుకోవడంతో అతనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేగంగా వెళ్తుండటంతో.. చేసిన తప్పును చెప్పడమే తప్పయిందని అంటున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+