వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రతి థర్స్‌డే సైకిల్‌పైనే, ఐటి ఉద్యోగులు ఒక్క రోజైనా...: కార్ ఫ్రీ థర్స్‌డేలో సివి ఆనంద్ (ఫొటోలు)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాదులోని మాదాపూర్‌లో గురువారం సైక్లింగ్ ఉత్సవం కోలాహాలంగా సాగింది. కార్ ఫ్రీ థర్స్‌డే సందర్భంగా నిర్వహించిన ఈ సైక్లింగ్‌లో ముఖ్యఅతిథిగా సైబరాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్ పాల్గొన్నారు. సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐటీ డిపార్ట్‌మెంట్, నాస్కాం, హైసియా సంయుక్త ఆధ్వర్యంలో ఇది జరిగింది.

ఈ ర్యాలీని యూరోకిడ్స్ పాఠశాల విద్యార్థులు జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో సీవీ ఆనంద్‌తో పాటు వివిధ కంపెనీల సీఈఓలు, మహిళా ఉద్యోగినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక ప్రతీ థర్స్‌డే ఆఫీస్‌కు సైకిల్‌పై వస్తానని పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు.

సైక్లింగ్ ర్యాలీ అనంతరం కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రధానమైన ట్రాఫిక్, కాలుష్యం నివారణ కోసం ఐటీ కారిడార్‌లో కార్ ఫ్రీ థర్స్ డేను ప్రారంభించినట్లు చెప్పారు. గతంలో ఢిల్లీలో మాత్రమే కాలుష్య సమస్య ఉండేదని, ఇప్పుడు చైనా రాజధాని బీజింగ్‌లో ఫ్రెష్ గాలిని కొనే పరిస్థితి నెలకొందని చెప్పారు.

సైక్లింగ్ ఇలా..

సైక్లింగ్ ఇలా..

సైక్లింగ్ మాదాపూర్ సైంట్ ఫెసిలిటీ సాఫ్ట్‌వేర్ సంస్థ వద్ద మొదలైన ర్యాలీ సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయం వరకు సాగింది.

ఐటి కారిడార్‌లో..

ఐటి కారిడార్‌లో..

ఐటీ కారిడార్‌లో ఉన్న దాదాపు 4లక్షలమంది ఉద్యోగులు ఉన్నారని, ఇదంతా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని సివి ఆనంద్ అన్నారు.

ట్రాఫిక్ పెరిగింది...

ట్రాఫిక్ పెరిగింది...

హైదరాబాద్‌తో పాటు సైబరాబాద్‌లో సైతం ట్రాఫిక్ రద్దీ పెరిగిందని సివి ఆనంద్ అన్నారు. దీనికి పరిష్కారంగా ప్రతి ఐటీ సంస్థ వారి ఉద్యోగులను ఒక్క రోజైనా సైకిళ్లపై వచ్చేలా చూడాలని సూచించారు.

చర్యలు తీసుకుంటాం..

చర్యలు తీసుకుంటాం..

ఐటి ఉద్యోగులు వారానికి ఒక్క రోజైనా సైకిల్ మీద రావడానికి అనువైన రోడ్డు మార్గాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని సివి ఆనంద్ చెప్పారు.

కార్ కూల్ వ్యవస్థ

కార్ కూల్ వ్యవస్థ

ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు కార్‌కూల్ వ్యవస్థను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని సివి ఆనంద్ చెప్పారు.

ఐటి ఉద్యోగులు..

ఐటి ఉద్యోగులు..

సైక్లింగ్ కార్యక్రమంలో మాదాపూర్ డీసీపీ కార్తీకేయ, ట్రాఫిక్ డీసీపీ అవినాష్ మహంతి, పలువురు కంపెనీల సీఈవోలు, ఐటీ ఉద్యోగులు పాల్గొన్నారు.

English summary
Cyberabad police Commissioner CV Anand has decided to take cycle every thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X