నేను టిఆర్ఎస్‌లోనే ఉంటా, నా ఇమేజ్ దెబ్బతీస్తున్నారు: డీఎస్
తాను తెలంగాణ రాష్ట్ర సమితిని (టిఆర్ఎస్) వీడటం లేదని ఆ పార్టీ నేత డి శ్రీనివాస్ శుక్రవారం స్పష్టం చేశారు. తాను తెరాసను వీడుతున్నట్లు వచ్చిన వార్తలను ఆయన కొట్టి పారేశారు.
హైదరాబాద్: తాను తెలంగాణ రాష్ట్ర సమితిని (టిఆర్ఎస్) వీడటం లేదని ఆ పార్టీ నేత డి శ్రీనివాస్ శుక్రవారం స్పష్టం చేశారు. తాను తెరాసను వీడుతున్నట్లు వచ్చిన వార్తలను ఆయన కొట్టి పారేశారు.
ఈ వార్తలపై తాను కలత చెందానని చెప్పారు. తన ఇమేజ్ దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ వీడినని చెప్పినా వార్తలు రావడం బాధాకరమన్నారు.

కాగా, డి శ్రీనివాస్ తిరిగి సొంత గూటికి చేరనున్నారనే ప్రచారం ఇటీవల సాగుతోంది. గాంధీభవన్‌లో పిసిసి బీసీ సెల్ నేతల సమావేశం సందర్భంగా కూడా ఈ విషయం చర్చకు వచ్చిందని అంటున్నారు.
అంతేకాదు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో డిఎస్ ఇప్పటికీ టచ్‌లో ఉన్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications